Advertisement
మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్తగా టీ పాలిటిక్స్ లో వలసల పర్వం మళ్ళీ మొదలైంది. నేతలు వరుస పెట్టి కండువాలు మార్చేస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలన్నీ మంతనాలు జరుపుతున్నాయి. దీంతో టీ పాలిటిక్స్ లో జంపింగ్ జపాన్ లా అంశం హార్ట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే, టిఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసిఆర్ కు లేఖ కూడా పంపారు.
Advertisement
2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానం పై లేఖలో ప్రస్తావించారు. ఇక మాజీ ఎంపీ బూర నర్సయ్య రాజీనామా తో టి ఆర్ ఎస్ లో అలజడి మొదలైంది. ఉద్యమకారుడు పార్టీని వీడటంపై ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. కేవలం పార్టీ ముఖ్య నేతల నిర్లక్ష్యంతోనే బూర దూరమయ్యారనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ టిఆర్ఎస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్న టెన్షన్ కనిపిస్తోంది. అయితే బైపోల్ లో టీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపుతోందనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్యతో పాటు పోయే వారిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సదరు ఎంపీని తమ వైపు తిప్పుకుంటే బీజేపీకి మంచి మైలేజ్ రావడమే కాకుండా టిఆర్ఎస్ ని గట్టి దెబ్బ కొట్టినట్లుగా ఉంటుందని బిజెపి శ్రేణులు భావిస్తున్నారు. టిఆర్ఎస్ లో సైలెంట్ లీడర్ గా కొనసాగుతున్న ఓ ఎంపీ కూడా కమలం గూటికి చేరితేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పౌల్ట్రీ రంగంలో లీడింగ్ బిజినెస్ మెన్ గా ఉన్నారు. పలు వ్యాపార సంస్థల్లో ఈటల రాజేందర్ తో భాగస్వామ్యం ఉంది. రాజకీయం, వ్యాపారాభివృద్ధి కోణంలో ఆలోచించే బిజెపిలో చేరడమే బెటర్ ఆప్షన్ గా గులాబీ పార్టీకి చెందిన ఎంపీ భావిస్తున్నారట.