Advertisement
రిపబ్లిక్ పార్టీ తరపు ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ లో కలవరం మొదలైంది ఇదివరకులా ధీమాగా కనిపించట్లేదు. గెలుస్తానని ఎక్కడ చెప్పట్లేదు. ప్రత్యర్థిపై మాత్రం ఒంటి కాలుపై లేస్తున్నారు. బైడెన్ తప్పుకుని కమల హ్యారిస్ పేరు ప్రకటించగానే తన గెలుపు మరింత ఈజీ అని ట్రంప్ చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే ఆ దూకుడు తగ్గింది కమల గెలుపోటములపై సర్వేలు ఇస్తున్న రిపోర్టులతో ట్రంప్ లో వణుకు మొదలైంది. వార్ వన్ సైడ్ అయినట్లు 78% గెలుపు అవకాశాలతో ఉన్న ట్రంప్ కు మారిన పొలిటికల్ సినారియతో ఏం చేయాలో తెలీక కొత్త ఎత్తులు వేస్తున్నారు.
Advertisement
బిడెన్ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నంతకాలం ట్రంప్ గెలుపు అంత ఈజీ కాదని అమెరికన్స్ ఏ కాదు ప్రపంచ దేశాల ప్రజలు కూడా భావించారు. ట్రంప్ కూడా వారం రోజుల క్రితం వరకు అదే ధీమాతో ఉన్నారు సానుభూతి తోడైంది. ప్రచారంలో ట్రంప్ పై కాల్పులతో ఆయనకు ప్రజాదరణ పెరిగింది. తనమీద దాడి జరిగిన వెంటనే ట్రంప్ వ్యవహరించిన తీరు కూడా అందరినీ బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు. ఆ తర్వాత యుఎస్ రాజకీయాల్లో అసలు స్టోరీ మొదలైంది. బిడెన్ తప్పుకుని కమల హ్యారిస్ పేరును ప్రకటించారు. అప్పుడు కూడా ట్రంప్ లో ధీమా తగ్గలేదు.
Advertisement
Also read:
రోజులు గడిచిన తరవాత ట్రంప్ లో భయం మొదలైంది. కమలకి రోజురోజుకీ ఆదరణ బాగా పెరుగుతోంది. ట్రంప్ గెలుపు అవకాశాలు తగ్గిపోతున్నాయి. రోజురోజుకి ఆమెకు ఆదరణ పెరుగుతోంది. ట్రంప్ కి అవకాశాలు భారీగా తగ్గిపోతున్నాయి. 78 శాతంగా ఉన్న ట్రంప్ గెలుపు అంచనాలు 49 శాతానికి తగ్గాయి. ఇప్పటికి ఒకటి రెండు శాతం ఓట్లతో ట్రంప్ ఆదిత్యంలో ఉన్నా కమల గట్టి పోటీ చేస్తున్నారని వార్త స్పష్టం అవుతోంది. కమలాకు 47% ట్రంప్ కి 48 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!