Advertisement
తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అలర్ట్. పోలీస్ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ ఓ అప్డేట్ ఇచ్చింది. పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేయగా, దేహధర్యుడా పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు డిసెంబర్ 8 నుంచి నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
Advertisement
ఈ ఈవెంట్స్ నిర్వహించేందుకుగాను, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 సెంటర్లను రిక్రూట్మెంట్ బోర్డు ఎంపిక చేసింది. ఈ మొత్తం ప్రక్రియను 25 రోజుల్లోపు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దేహదారుడ్యా పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థులు నవంబర్ 29 తేదీ, ఉదయం 8 నుంచి డిసెంబర్ 3 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తన యూజర్ ఐడి, పాస్వర్డ్ ను ఉపయోగించి https://www.tslprb.in/ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు కలిపి పిఎంటి, పిఈటిల కోసం 2,37,862 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు అంచనా. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు అప్లై చేసినా, దేహదారుడ్యా పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
Advertisement
శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించే ప్రదేశాలు ఇవే:
హైదరాబాద్-ఎస్ఏఆర్ సిపిఎల్ అంబర్ పేట
సైబరాబాద్-8వ బెటాలియన్ కొండాపూర్
రాచకొండ-సరూర్ నగర్ స్టేడియం
సంగారెడ్డి-పోలీస్ పరేడ్ గ్రౌండ్
సిద్దిపేట-పోలీస్ పరేడ్ గ్రౌండ్
కరీంనగర్-సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం
అదిలాబాద్-పోలీస్ పరేడ్ గ్రౌండ్
నిజామాబాద్-రాజారాం స్టేడియం నాగారం
మహబూబ్ నగర్-డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్
వరంగల్-హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం
ఖమ్మం-పోలీస్ పరేడ్ గ్రౌండ్
నల్గొండ-మేకల అభినవ్ స్టేడియం
Read also: యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?