Advertisement
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబునాయుడు మొదట తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత సీఎం గా బాధ్యతలు స్వీకరించాలని ముందే అనుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు తిరుపతిలో టీడీపీ నాయకుల్ని కలిశారు తర్వాత తిరుమల చేరుకున్నారు. చంద్రబాబు గాయత్రి నిలయం దగ్గరకు వెళ్లారు. చంద్రబాబుని టీడీపీ నాయకులు, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తో పాటుగా దేవదాయ శాఖ అధికారులు కారు దగ్గరకు వెళ్లి ఘన స్వాగతం పలికారు.
Advertisement
ధర్మారెడ్డి తో పాటు టిటిడి అధికారులు ఎవరూ గాయత్రి నిలయానికి వెళ్లిన చంద్రబాబు దగ్గరికి వెళ్ళలేదు చంద్రబాబు నేరుగా గాయత్రి నిలయంలో లోపలికి వెళ్లారు. గాయత్రి నిలయం విశ్రాంతి భవనం లోపల టీటీడీ జేఈవో, టీటీడీ ఇన్చార్జ్ ఈవో వీరబ్రహ్మం సీఎం చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇవ్వడానికి ప్రయత్నించారు టిటిడి అధికారులు తీరు చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు జెయు వీరబ్రహ్మం నుండి బొకే తీసుకోవడానికి నిరాకరించి విశ్రాంతిభవనం లోపలికి వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు.
Advertisement
Also read:
ఈ అధికారులు తీరును అందరూ ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని టీటీడీలోని ఉన్నతాధికారులు అనుకున్నారా అని కొందరు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఇంతకాలం వైసీపీ సేవలో వున్నా అధికారులు ఆ మూడ్ నుండి ఇంకా బయటకు రాలేదా అని టీడీపీ నాయకులు అంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ వెళ్ళిన తర్వాత టిటిడిలోని ఉన్నత అధికారులు సంగతి చూడాలని చంద్రబాబు అనుకుంటున్నారని టిడిపికి చెందిన ఒక సీనియర్ నాయకుడు అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!