Advertisement
తిరుమల శ్రీవారిని ఎన్ని సార్లు చూసిన తనివితీరదు. అయితే.. గంటల తరబడి క్యూ లైన్స్ లో నిలబడి క్షణం పాటు దొరికే ఆయన దర్శనం కోసం ఎందరో భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే.. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారి భక్తులకు తీపి కబురు చెప్పింది. ఇక నుంచి క్యూ లైన్స్ లో నుంచోవాల్సిన అవసరం లేదని టీటీడీ తెలిపింది. తిరుమల విఐపి బ్రేక్ దర్శనం కోసం కేటాయించిన టికెట్స్ ను నేరుగా ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేయబోతోంది.
Advertisement
ఈ టికెట్ల కోసం ఎంబీసీ 34లోని కౌంటర్ వద్ద భక్తులు చాలా సేపు క్యూ లైన్స్ లో ఎదురు చూడాల్సి వచ్చేది. అందుకోసమే టీటీడీ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో భక్తులు రికమెండేషన్ లెటర్ పంపాల్సి ఉంటుంది. అలా పంపిన వారి మొబైల్ నెంబర్ కు ఓ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి భక్తులు పేమెంట్ చెయ్యాల్సి ఉంటుంది. ఆ లింక్ లోనే డబ్బుని చెల్లించాక, ఆన్ లైన్ లోనే టికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
Advertisement
గత రెండు రోజుల నుంచి టీటీడీ ఈ ప్రయోగాత్మక విధానాన్ని అమలు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే బ్రేక్ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విక్రయించే అవకాశం ఉంది. బ్రేక్ దర్శనం కోసం టికెట్ కొనడానికి గంటల తరబడి క్యూ లైన్స్ లో నిలబడాల్సిన అవసరం ఉండదు.
Read More:
శ్రీమంతుడు కథ కాపీ వివాదం నుంచి నమ్రత మహేష్ ని తెలివిగా ఆలా తప్పించేసారా ?
1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హరి కృష్ణ కి జరిగిందే మళ్ళీ షర్మిల కి జరగబోతుందా ?
యాత్ర 2 సినిమాలో షర్మిల, లోకేష్, పవన్ క్యారెక్టర్లని ఎందుకు పెట్టలేదో తెలుసా ?