Advertisement
ఎమ్మెల్యేల ఎర కేసులో మొదట్నుంచి వినిపిస్తున్న పేరు తుషార్. ఏకంగా గవర్నర్ తమిళిసై ప్రెస్ మీట్ లోనే అతని పేరు ప్రస్తావించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే.. విచారణకు హాజరు కావాలని సిట్ ఈయనకు నోటీసులు జారీ చేసింది. కానీ, ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో జగ్గుస్వామితో పాటు తుషార్ కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరితోపాటు లాయర్ శ్రీనివాస్, బీఎల్ సంతోష్ కు నోటీసులివ్వగా.. కేవలం శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. సంతోష్ తనకు సమయం కావాలని కోరారు.
Advertisement
అయితే.. ఎట్టకేలకు తుషార్ సిట్ నోటీసులపై స్పందించారు. ఏకంగా కేరళ హైకోర్టునే ఆశ్రయించారు. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. సిట్ దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పైగా సీఎం కేసీఆర్ ను ప్రతివాదిగా పేర్కొన్నారు తుషార్. సీఎం రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు జరుగుతోందని ఆరోపించారు.
Advertisement
ఈనెల 21న విచారణకు రావాలని 16వ తేదీన తనకు 41ఏ నోటీసు ఇచ్చారన్నారు తుషార్. అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు 2 వారాల గడువు కోరానని చెప్పారు. తన మెయిల్ కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో మొదట్నుంచి జగ్గుస్వామి కోసం పోలీసులు గాలిస్తుండగా ఆచూకీ లేదు. తుషార్ కూడా స్పందించలేదు. దీంతో వీళ్లిద్దరు దేశం వదిలి వెళ్లకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు ఐదున్నర గంటలపాటు.. న్యాయవాది నాగరాజు సమక్షంలో విచారణ చేపట్టారు. ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్ స్థలాన్ని సబ్ లీజుకు ఇచ్చి డబ్బులు వసూలు చేశారన్న కేసు దర్యాప్తులో భాగంగా నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.