Advertisement
దర్శకుడు, నటుడు, మ్యూజిక్ దర్శకుడు, నిర్మాత, బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆ-త్మ-హ-త్య చేసుకున్న సంఘటన సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున సమయంలో ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. గత రెండు మూడు నెలలుగా డిప్రెషన్ లో ఉన్న మీరా ఒత్తిడి తట్టుకోలేకే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
ఇప్పటికే తమిళ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విజయ్ ఆంటోనీ కుటుంబాన్ని కలిసి తమ సంతాపాన్ని తెలిపారు. ఈ కేసు విషయమై చెన్నై పోలీసులు ఈ కేసుని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు.
మీరా ఆ-త్మ-హ-త్య చేసుకున్న గదిని పరిశీలించారు. మీరా ఫోన్ ను కూడా సీజ్ చేశారు. ఆమె ఫోన్ లో చివరిగా ఎవరి కాల్ వచ్చింది.. ఎవరికి మెసేజ్ వెళ్ళింది అన్న విషయాలపై కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.
Advertisement
మీరా మరణించడంతో ఆమె చదువుతున్న స్కూల్ లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తోటి విద్యార్థులు, స్కూల్ టీచర్లు ఆమెకు తమ సంతాపాన్ని తెలియచేసారు. ఆమె టాపర్ కాకున్నా.. తెలివైన విద్యార్థి అని.. ఇలాంటి పని ఎందుకు చేసిందో అర్ధం కావడం లేదని ఆమె స్కూల్ టీచర్ ఆవేదన చెందారు.
స్కూల్ లో పిల్లలని ఒత్తిడి చేయమని, చదువు పరంగా ఆమె బాగానే ఉంటుందని, ఆమెపై ఎలాంటి ఒత్తిడి లేదని.. ఇంత చిన్న వయసులో ఆమెకు ఎలాంటి ఒత్తిడి ఉందోనని ఆమె బాధపడ్డారు. అయితే మీరా తాను లావుగా ఉందని బాధపడేది.. ఈ ఆత్మనూన్యతా నుంచి దూరం చేయడానికే ప్రయత్నించే వారమని ఆమె చెప్పుకొచ్చారు.
ఆమెను బాధపెట్టిన ఘటన ఎదో తెలియాల్సి ఉందని, ఆమె మరణం వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉందని అందరు తమ తమ అభిప్రాయాలను తెలిపారు.
మరిన్ని..
బ్రాహ్మణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందా..?
Jr NTR: చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?
భార్యకు మల్లెపూలు తెస్తే అలా జరుగుతుందా..? ప్రతీ భర్త తప్పక తెలుసుకోవాలి..!