Advertisement
ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ ఇరుక్కున్న సంగతి విదితమే. అయితే.. ఆయనను విచారించాల్సిందిగా హై కోర్ట్ సిబిఐకు ఆదేశం ఇచ్చింది. అయితే.. ఆయనను విచారించడానికి హై కోర్ట్ ఒక్క రోజుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ, నారా లోకేష్ కు సిబిఐ నోటీసు పంపించడంతో ఆయన రెండవ రోజు కూడా విచారణకు హాజరు అయ్యారు. దీనితో సిబిఐ రెండవ రోజు కూడా తన విచారణను కొనసాగించింది. విచారణ పూర్తి అయ్యిన తరువాత నారా లోకేష్ బయటకు వచ్చారు.
Advertisement
హై కోర్ట్ అనుమతి ఇవ్వకున్నా సిబిఐ నోటీసు పంపడంతోనే రెండవ రోజు కూడా విచారణకు హాజరు అయ్యానని అన్నారు. మొత్తం ఆరు గంటల పాటు విచారణ చేసారని నారా లోకేష్ పేర్కొన్నారు. నిన్న అడిగిన ప్రశ్నలనే ఈరోజు కూడా అడిగారని.. సమాధానం ఇచ్చానని చెప్పారు. మొత్తం 47 ప్రశ్నలలో ఒకటి రెండు మినహాయించి.. మిగతా అన్ని ప్రశ్నలూ నిన్న అడిగినవేనని చెప్పారు. లంచ్ కి ముందు మాత్రం బాహుబలి సినిమా చూపారని.. అన్నిటికి సమాధానం ఇచ్చే వస్తున్నానని అన్నారు.
Advertisement
విచారణ మధ్యలో భువనేశ్వరి ఐటి రిటర్న్స్ ని ముందు పెట్టారని అన్నారు. అసలు నిందితులు కానీ వారి ఐటి వివరాలను ఎలా బయటపెడతారని ప్రశ్నించారు? ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుంటామని.. ఐటి అధికారులకు లేఖ రాస్తామని అన్నారు. జీవో 282 గురించి కూడా అడిగారని.. కోర్టు ఇచ్చిన ఆదేశాలతోనే 99 మందికి ఎక్సెప్షన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదంతా కక్ష గట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి చేస్తున్నారని మండిపడ్డారు. విధాన పరంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసారు. కానీ కేసులో కీలకంగా ఉన్న ప్రేమ చంద్రా రెడ్డి, అజయ్ కల్లం లని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ప్రశ్నించారు. ఓ మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస సదుపాయాలను కూడా ఇవ్వడంలేదని.. అన్యాయంగా 32 రోజుల నుంచి జైల్లో పెట్టారని మండిపడ్డారు.
మరిన్ని..
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిలియనీర్లు ఎవరో తెలుసా? ఎంత మంది ఉన్నారంటే?
ఢిల్లీ మెట్రోలో మరో నీచం.. వైరల్ అవుతున్న కపుల్ వీడియో, తిట్టిపోస్తున్న నెటిజన్స్!