Advertisement
ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే ఒకానొక సమయంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఆయన కెరీర్ పూర్తిగా తలకిందులు అయిపోయింది. అప్పటినుంచి అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. ఇక చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014 న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈయన రాసిన ఎమోషనల్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
Advertisement
అది ఉదయ్ కిరణ్ రాత లోనే…. ‘విషిత మా అమ్మ అంటే ఎంత ఇష్టమో… ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధపడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచివాడు అని నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒక్కసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్ గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధపడుతున్నారు.
అందరూ సంతోషంగా ఉండాలి అంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మ నిన్ను ఓసారి కౌగిలించుకొని ఏడవాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’ అని ఉంది. ఈ లేఖను చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ALSO READ;
దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?