Advertisement
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. అయితే సనాతన ధర్మం వ్యవహారంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ఇంకా చెప్పాలంటే, నిర్మూలనే లక్ష్యంగా ఎక్కడ కావాలంటే, అక్కడ మరింతగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని.. మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆయనపై పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తున్నాయి.
Advertisement
Advertisement
తాజాగా స్టాలిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సహా మొత్తం 262 మంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. బీహార్ లో ఉదయనిధి స్టాలిన్ పై కేసు కూడా నమోదు అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకేసి సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు మౌనంగా వ్యవహరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 10 లోపు శేఖర్ బాబు పదవీ నుంచి తొలగిపోవాలని.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు సనాతన ధర్మానికి వ్యతిరేకం అంటే.. హిందూ, దేవాదాయ శాఖ ఎందుకు అని అని పుదుచ్చెరి లెప్టినెంట్ గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు. తాను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానే తప్ప.. హిందువుల గురించి కాదు అని స్పష్టం చేశారు ఉదయనిధి స్టాలిన్. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని.. మరోవైపు మంత్రి శేఖర్ బాబు రాజీనామాకు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఉదయనిధి స్టాలిన్.