Advertisement
మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ ఫ్యామిలీలో మరో విషాదం కలకలం రేపింది. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మరణించారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడం మరింత విషాదాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 10 రోజుల కిందట ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుర్ఘటనతో నందమూరి కుటుంబంలో విషాదం అలుముకుంది.
Advertisement
అయితే, తుది శ్వాస విడిచే వరకు ఉమామహేశ్వరి ఇంట్లోనే ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్. ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆవిడే దగ్గరుండి చూసుకునేవారు. అయితే మొదటి వివాహం విఫలం కావడంతో కొన్నాళ్లపాటు ఉమామహేశ్వరి ఎన్టీఆర్ తోనే తన సమయాన్ని గడిపింది. ఆ తర్వాత మరొక వివాహం జరిగి ఆమె జీవితం సెటిల్ అయింది. అని అంతా భావించగా ఉన్నపలంగా ఇలా జరగడం ఎవ్వరూ తట్టుకోలేకపోతున్నారు.
Advertisement
ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు కాగా వారికి పెళ్లిళ్లు అయ్యి సెటిల్ అయిపోయారు. అయితే ఉమామహేశ్వరి రెండో వివాహం తర్వాత బేకరీ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. కొన్నాళ్లపాటు అది బాగానే జరిగినా కూతుర్ల పెళ్లిళ్లు అయ్యాక ఆమె ఎందుకో ఒంటరితనం ఫీలయ్యారు. భర్త కూడా ఎప్పుడు బిజినెస్ లతో బిజీగా ఉంటూ బయట తిరుగుతూ ఉండడం వల్ల ఆమె ఇంట్లోనే గడపాల్సి రావడంతో అటు బేకరీ కి కూడా వెళ్లడం మానేసి పూర్తిగా ఇంట్లోనే ఉంటూ తీవ్ర డిప్రెషన్ లోకి లోనయ్యారు. ఆ తర్వాత ఆ డిప్రెషన్ బారిన పడి ఆమె చివరికి కన్నుమూశారు.
Read Aslo : గజిని మూవీ కథను వదులుకున్న స్టార్ హీరోలు !