Advertisement
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైఫల్యం కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఎల్బీ విషయంలో వివాదాస్పద నిర్ణయం తీసుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నితిన్ మీనన్ ఇండోర్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్ట్ లోను తన పేలవ అంపైరింగ్ ను కొనసాగించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తన చెత్త అంపైరింగ్ తో రోహిత్ శర్మను సేవ్ చేశాడు.
Advertisement
READ ALSO : వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నాడంటే ?
మిచెల్ స్టార్క్ వేసిన ఫస్ట్ ఓవర్ తొలి బంతికే రోహిత్ కీపర్ క్యాష్ ఇవ్వగా, అంపైర్ నితిన్ మీనన్ అవుట్ ఇవ్వలేదు. ఆసీస్ ఆప్పీల్ చేసిన పట్టించుకోలేదు. ఫస్ట్ బాల్ కు రివ్యూ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ స్మిత్ సమీక్ష కోరలేదు. కానీ రిప్లైలో బంతి బ్యాట్ ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అదే ఓవర్ నాలుగో బంతికి ఎల్బీ కోసం ఆసీస్ అప్పీల్ చేయగా, నితిన్ మీనన్ అవుట్ ఇవ్వలేదు. బంతి బౌన్స్ అయిందని భావనతో స్మిత్ రివ్యూ తీసుకోలేదు.
Advertisement
READ ALSO : మాస్ రివెంజ్ అంటే ఇదేమో ! తన భార్య ప్రియుడితో వెళ్ళిపోయింది ! రివెంజ్ ఎలా తీర్చుకున్నాడంటే ?
కానీ రిప్లైలో బాల్ ట్రాకింగ్ ను పరిశీలించగా స్టంప్స్ ను తాకినట్లు స్పష్టమైనది. అంపైర్ నితిన్ మీనన్ తప్పిదంతో పాటు ఆసిస్ రివ్యూ తీసుకోకపోవడంతో రోహిత్ శర్మకు తొలి ఓవర్ లోనే రెండు అవకాశాలు లభించాయి. కానీ ఆ అవకాశాలను రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. నిర్లక్ష్యపు షాట్ తో వెనుదిరిగాడు. జడేజా వికెట్ విషయంలో బంతి బ్యాట్ కు తాకిన ఎల్బీగా నితిన్ వికెట్ ఇచ్చాడు. కానీ జడేజా రివ్యూతో సేవ్ అయ్యాడు.
READ ALSO : Kamal Hassan: కమల్ హాసన్ తో ప్రేమలో పడ్డ స్టార్ 8 హీరోయిన్స్ లిస్ట్ ఇదేనా ?