Advertisement
సాధారణంగా ఎవరైనా కొత్త జీవితంలోకి అడుగుపెడితే సంతోషంగా ఉండవచ్చని భావిస్తుంటారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ సంబంధం అయితే తమ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని ఆశపడింది. తాను అనుకున్నట్టుగానే పెళ్లయి అమెరికా వెళ్ళిపోయింది. సంవత్సరం పాటు భర్తతో కలిసి హాయిగా జీవించింది. కానీ.. జీవితంలో ఎవ్వరు తీర్చలేని లోటు ఏర్పడింది ఆమెకు. బలవంతంగా తనువు చాలించింది. భర్త లేని లోటు తట్టుకోలేకపోయింది. నీ వెంటే నేను అంటూ తనతో పాటు వెళ్లిపోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
వారు చూడచక్కని జంట. వారికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఇప్పుడు ఇద్దరూ లేరు. భర్త మరణిస్తే ఆ విషయాన్ని తట్టుకోలేక పోయిన భార్య కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేట్ పరిధిలో జరిగింది. భర్త అంత్యక్రియలు జరిగిన సాయంత్రమే భార్య కూడా తనువు చాలించింది. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబర్ పేట డిడి కాలేజ్ కి చెందిన 29 ఏళ్ల సాహితీకి వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మనోజ్ తో ఏడాది కిందటే పెళ్లి జరిగింది. కాగా.. పెళ్లి తర్వాత దంపతులు ఇద్దరూ కలిసి అమెరికా వెళ్లారు. సంవత్సరం పాటు అక్కడే ఉన్నారు. తల్లిదండ్రులను చూసేందుకు సాహితి ఈనెల 22న హైదరాబాద్ కు వచ్చింది. అదే సమయంలో అమెరికాలో ఉన్న ఆమె భర్త మనోజ్ కు గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. భర్త మరణ వార్త తెలిసినప్పటి నుంచి సాహితి తీవ్ర మనోవేదనకు గురైంది.
Advertisement
ఈనెల 23న మనోజ్ భౌతిక గాయాన్ని అమెరికా నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. భర్త మృతదేహాన్ని చూసిన సాహితీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మనోజ్ అంత్యక్రియలు ముగిసిన తరువాత అంబర్ పేట్ లోని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి సాహితీ సైలెంట్ గా ఉంటూ ఎవరితోనూ మాట్లాడలేదు.అప్పటివరకు తనతో ఉన్న చెల్లెలు బయటికి వెళ్లడంతో.. అదే అదునుగా చూసుకుని, ఆత్మహత్యకు పాల్పడింది సాహితీ. ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని తుది శ్వాస విడిచింది. కేవలం పది నిమిషాల్లో బయట నుంచి వచ్చేసరికి సాహితీ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ చూడచక్కగా ఉన్నారని పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కానీ.. తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లుగా ఇద్దరు ఇలా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూస్తున్నారని యువతి ఏం చేసిందో తెలుసా ?