Advertisement
ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలనేవి మరి ఎక్కువైపోయాయి.. భార్య భర్తల మధ్య ప్రాణాలు తీసే వరకు ఈ సంబంధాలు దారితీస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.. మరి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.. ఏపీ రాష్ట్రంలోని కాకినాడ ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్నటువంటి అక్బర్ కు మొదటి భార్య మరణించడంతో యానాంకు చెందినటువంటి అహ్మదున్నిసా బేగం ను రెండో వివాహం చేసుకున్నాడు.వీరికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
Advertisement
ALSO READ; ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు!
అక్బర్ తల్లిదండ్రులు కూడా అతనితోనే ఉంటారు. ఇదిలా ఉండగా జూన్ 23న అక్బర్ ఇంట్లోనే మృతి చెందాడు.. కుటుంబ సభ్యులు అతన్ని సహజ మరణంగా భావించి అంత్యక్రియలు కూడా చేశారు… కట్ చేస్తే.. గత కొంతకాలం కిందట అక్బర్ తన భార్యకు కొత్త ఫోను కొనిచ్చారు.. ఆమె దగ్గర ఉన్నటువంటి పాత మొబైల్ ని తన తండ్రికి ఇచ్చారు.. అయితే కొడుకు మరణించిన రెండు నెలల తర్వాత ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగా వాట్సాప్ లో కొన్ని విస్తుపోయె మెసేజ్ లు బయటపడ్డాయి.. అదేంటంటే.. తన కోడలు అదే అపార్ట్మెంట్లో ఉండేటటువంటి రాజేష్ జైన్ మరియు కిరణ్ అనే యువకులతో ఫోన్లో మాట్లాడిన విషయాలు రికార్డు అయ్యాయి..
Advertisement
దీంతో తన తండ్రి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు.. అప్పుడు నిజాలు బయటపడ్డాయి.. తన కోడలు వారిద్దరి తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. తన సుఖానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో జూన్ 23వ తేదీన అక్బర్ కు నిద్రమాత్రలు ఇచ్చింది.. అతను నిద్ర లోకి వెళ్ళగానే పథకం ప్రకారం కిరణ్ ను పిలిపించుకొని.. క్లోరోఫామ్ ద్వారా అతని ముక్కును అదిమిపట్టి ప్రాణాలు తీశారు.. ఈ సమయంలో రాజేష్ జైన్ ఇంటి బయట కాపలా కాశారు. ఈ విధంగా విషయం బయటకు రావడంతో పోలీసులు అహ్మదున్నిసా తో పాటుగా రాజేష్, కిరణ్ లను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారి స్టైల్ లో విచారిస్తే నిజాలు అంగీకరించారు.
ALSO READ;
భార్య చేసే ఈ పనుల వల్లే భర్త పరాయి స్త్రీ వైపు చూస్తారు..!!