Advertisement
సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువ. ఈ వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయి. టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాలలో తెలిసిపోతుంది. యువత మీద సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా మొదలయ్యే పరిచయాలు ఎక్కడికో దారితీస్తున్నాయి. తాజాగా ఓ యువకుడికి సోషల్ మీడియాలో ఓ యువతీతో పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి ఎవరు? అది ఎక్కడికి దారితీసిందో తెలుసుకుందాం. ఫలక్ నుమా ఏసిపి షేక్ జహంగీర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని గోశాల ఈసా కాలనీకి చెందిన ముజామ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
Advertisement
Read also: సీఎం జగన్ కి పంచ్ ఇచ్చిన ‘జబర్దస్త్’ కమెడియన్!
ఇతడి రెండో భార్య కూతురు షయిస్తా బేగం (20) సుజాత కాలేజీలో బిఎస్సి చదువుతుంది. ఇదిలా ఉంటే పత్తర్ ఘాట్ కి చెందిన మైసన్ బీన్ సమద్ మిశ్రీ (25) స్థానికంగా లగ్జరీకారులను అద్దెకు ఇస్తూ సంపాదిస్తున్నారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పటినుంచో బంధుత్వంతో పాటు వైరం కూడా ఉంది. 2018లో చున్నీబట్టి వద్ద మీర్జా మాజామ్ బంధువులలోని ఒకరిని మైసన్ బీన్ సమద్ మిశ్రీ బంధువులు హ** చేశారు. ఈ కేసులో మీర్జా ముజామ్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. రౌడీ షీటర్ గా పేరు ఉన్న మీర్జా కి మిశ్రీ పలుమార్లు బెదిరింపు కాల్స్ చేశాడు. ఈ కేసు నుంచి తప్పుకోవాలని హెచ్చరించాడు. 2021లో ఏకంగా మీర్జా ముజామ్ కారుని తగలబెట్టాడు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వైరం కొనసాగుతుండగా.. షయిస్తా బేగం కు మిశ్రీ తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
Advertisement
అయితే కొన్ని ఏళ్ల తర్వాత షయిస్తా బేగం మీర్జా ముజామ్ కూతురు అని మీశ్రీ కి తెలిసింది. దీంతో తాను ప్రేమిస్తున్న యువతి తన శత్రువు కుమార్తె అని తెలుసుకున్న మిశ్రీ నేరుగా అతడి ఇంటికి వెళ్లి “మీ కుమార్తెని ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటా” అని హెచ్చరించాడు. దీంతో మీర్జా ముజామ్ తన కుమార్తెకు అసలైన విషయం చెప్పి ఈ పెళ్లి జరగదని హెచ్చరించాడు. అయితే నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ నాన్నను చంపేస్తానని షయిస్తా బేగంని, మీశ్రీ బెదిరించాడు. మిశ్రీ వేధింపులు తాళలేక ఆ కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి మకాం మార్చింది. అతనికి సోషల్ మీడియాలో కూడా దూరమైంది. ఆ తర్వాత కాలేజీ దగ్గర కన్నేసిన మిశ్రీ అక్టోబర్ 17న మీర్జా ముజామ్ తన కుమార్తె షయిస్తాను సుజాత కాలేజీ వద్ద దింపి వెళుతుండగా.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు.
శాస్త్రీపురం తీసుకువెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత కాలేజీ దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన షయిస్తా జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి ఫలక్నుమా పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. మిశ్రీ తనను బలవంతంగా తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడని షయిస్తా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్నారు. అయితే షయిస్తాను అపరించినప్పటికీ తను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుందని మిశ్రీ చెబుతున్నాడు. ప్రేమించిన యువతి తనపై కిడ్నాప్ కేసు పెట్టడమే కాకుండా పోలీసుల సహాయంతో ఆమెకు తనతో తలాక్ చెప్పించేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో మరోసారి ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.