Advertisement
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతి సినిమాలోని ఓ నటుడు కనిపిస్తుంటాడు. ఆయన పేరు చంద్రశేఖర్. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్’ లోను కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆర్టిస్టుగా ‘చత్రపతి’ సినిమా చంద్రశేఖర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అప్పటి నుంచి నటుడుగా నిలదొక్కుతున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు.
Advertisement
ఇది ఇలా ఉండగా… చంద్రశేఖర్ భార్య మన తెలుగు సినిమా రంగంలో పెద్ద నటి అని తెలుసా ? చంద్రశేఖర్ భార్య పేరు నిలియా భవాని. ఈమె టాలీవుడ్ లో కిక్ 2, సైరా నరసింహారెడ్డి, నాని జెంటిల్ మ్యాన్ , రామ్ పండగ చేసుకో , వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఒక టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ లో కూడా అజిత్ మరియు విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర సీరియల్స్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా మోడలింగ్ లో మంచి నైపుణ్యం సంపాదించింది. ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన నీలియ భవాని చంద్రశేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్న సమయానికి చంద్రశేఖర్ సినిమాల్లోకి అడుగు పెట్టలేదు.
Advertisement
అంతేకాకుండా చంద్రశేఖర్ కి ఆ సమయానికి ఎలాంటి ఉద్యోగం కూడా లేకపోవడంతో నీలియా భవాని తల్లిదండ్రులు వీళ్లిద్దరీ పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో నీలియా భవాని చంద్రశేఖర్ తో కలిసి హైదరాబాద్ కి వచ్చి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చంద్రశేఖర్ సినిమాల్లో ఛాన్సులు కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడే రాజమౌళి ఈటీవీలో తెరకెక్కిస్తున్న “శాంతి నివాసం” సీరియల్ లో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది.
ఆ విధంగా చంద్రశేఖర్ సినిమాల్లో బిజీ కావడంతో నీలియా భవాని కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి సినీ రంగంలోకి ప్రవేశించి మంచి పాత్రలు పోషిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగింది. కాకపోతే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, మంచిగా కొనసాగుతున్న వీరిద్దరి దాంపత్య జీవితంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకుల వరకు దారితీసింది ఈ దంపతులిద్దరికీ ఒక కొడుకు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ నీలియా భవానితోనే ఉంటున్నారు. కూతురు పూజిత అపోలో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తుండగా, కొడుకు మహేశ్వరన్ క్రికెటర్ గా స్థిరపడాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.