Advertisement
ఉపాసన కొణిదెల గురించి పరిచయం చేయక్కర్లేదు. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని పంచుకుంటూ ఉంటారు. అలానే మంచి భార్యగా ఉత్తమ బిజినెస్ మ్యాన్ గా మంచి కోడలుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు ఉపాసన. ఇప్పుడు ఈమె మరో అడుగు ముందుకు వేశారు. తన అత్తగారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఉపాసన. ఆవిడ వంటలు ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వంటకాలు అందరికీ రుచి చూపించే విధంగా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు ఉపాసన. చిరంజీవి భార్య సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు.
Advertisement
Advertisement
ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకి ఇంటి ఫుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్ రాకుండా ఉండడానికి తన అత్తమ్మ కిచెన్ చాలా ఉపయోగపడుతుందని స్టార్ట్ చేశారు. బిజినెస్ లో మంచి ప్రావీణ్యం ఉన్న ఉపాసన ఇప్పుడు ఈ వెంచర్ లో సక్సెస్ సాధించాలని అంతా కోరుకుంటున్నారు. అత్తమ్మ కిచెన్లో వండిన ఒక్కో వంటకం ప్రతి ఒక్కరూ అనుభవించాలని ఆమె ఫీల్ అవుతున్నారు. మరి అత్త కోడళ్ళు ఇద్దరు చేయబోయే కొత్త ప్రయోగం ఎంత దాకా సక్సెస్ అవుతుందనేది చూడాలి.
ఇంస్టాగ్రామ్ వేదికగా ఉపాసన పోస్ట్ చేసిన వీడియోలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని రుచి సంప్రదాయం కలిసే చోట బంధాలు తరతరాలుగా నిలబడతాయని.. సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఆస్వాదించండి.. నేరుగా మా వంటగది నుండి మీ ఇంటికి అని ఉపాసన పోస్ట్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో ఇచ్చిన ఆన్లైన్ వెబ్సైట్ లింక్ ద్వారా ఈ వంటకాలను బుక్ చేస్తే ఇంటికి వస్తాయని ఉపాసన పోస్ట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!