Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈమధ్య ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొనగా అందులో ఆమె పెళ్లిళ్లు, సంబంధాలు, పిల్లలపై ఆయనను ప్రశ్నలు అడిగింది. తనను చాలామంది ఇంకా పిల్లల్ని ఎందుకు కనలేదని అడుగుతున్నారని, దీనికి ఏమని సమాధానం చెప్పాలని ఆమె అడగ్గా, పిల్లల్ని కనలేనందుకు బాధపడొద్దు.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
Advertisement
మీరు పదేళ్లు అవుతున్న, పిల్లల్ని కనడం లేదంటే, అందుకు మీకు సన్మానం చేయాలి. అంటూ సద్గురు తెలిపారు. అయితే ఉపాసన ఈ ప్రశ్న అడగడం ఏమోగానీ, త్వరలోనే ఈ దంపతులు పిల్లల్ని కనబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే పదేళ్లపాటు ఉపాసన దంపతులు పిల్లల్ని కనక పోవడం వెనుక ఆమె తాత ప్రతాపరెడ్డికి ఆమె ఇచ్చిన మాటనే కారణమని తెలుస్తోంది.
పెళ్లయ్యాక వెంటనే పిల్లల్ని కనబోనని, 10 ఏళ్లపాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు తాను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడతానని, అప్పటివరకు పిల్లల్ని కననని ఆమె ప్రతాపరెడ్డికి మాట ఇచ్చిందట. అయితే ఈ ఏడాదితో రామ్ చరణ్ దంపతులు 10 వసంతాలు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇక ఉపాసన పిల్లల్ని కంటుందని అంటున్నారు. కనుకనే మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరు తీపి కబురు ఎప్పుడు చెబుతారో చూడాలి.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?