Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా అందాల భామ ధమాకా ఫేమ్ శ్రీ లీల నటిస్తున్నది.
Advertisement
అయితే ఎన్నాళ్లో వేసిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కాకి డ్రెస్ లో టీ గ్లాస్ పట్టుకొని ఉన్న లుక్ ను విడుదల చేశారు. కుర్చీలో కూర్చోబెట్టి ఒక చేతిలో టీ గ్లాస్, మరో చేతిలో గన్ ఉంది. లుక్ పరంగా సూపర్ అనిపించుకున్న ఆ గెటప్ లో ఉన్నది అసలు పవన్ కళ్యాణ్ కాదనే అనుమానం అందరికీ వస్తుంది.
Advertisement
READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?
దర్శకుడు హరీష్ శంకర్ అలా పవన్ కళ్యాణ్ స్టైల్ గా ఫోజులు ఇచ్చి ఫోటోషూట్ చేసి పోస్టర్ ని రిలీజ్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు కామెంట్ రూపంలో కూడా ప్రస్తావిస్తూ ఉండటం విశేషం. ఆ విధంగా అది నిజమే అనేలా ఉంది. ఏది ఏమైనా ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊపు తీసుకొస్తే, పవన్ ని ద్వేషించే వారికి మాత్రం విమర్శలకు తావిచ్చేలా ఉందనే మాట వినిపిస్తుంది.
READ ALSO : ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటే మధ్యలోనే వదిలేస్తారట…!





