Advertisement
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. అక్కడినుండి ఈమె ఇప్పుడు సినిమాల్లో అవకాశాలని సంపాదించుకుంటోంది. తాజాగా ఈమె ఆనంద్ దేవరకొండ తో బేబీ అనే సినిమాలో నటించింది బేబీ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ కూడా ఈ ట్రైలర్ కి వచ్చాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెర మీదకి రాబోతోంది.
Advertisement

Advertisement
నటిగా మారడానికి స్పెషల్ గా ఏ రీజన్ లేదని ఆమె అంది చిన్నచిన్న అడుగులు వేస్తూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని తను చెప్పింది. లవ్ గురించి చెబుతూ.. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను లవ్ లో పడ్డానని వైష్ణవి అంది.
స్కూల్లో క్రష్ మాత్రమే ఉన్నట్లు వైష్ణవి చైతన్య అంది. ఇంటర్లో ఉన్నప్పుడు ప్రేమలో పడినట్లు ఆమె చెప్పింది. తొలిప్రేమ ఎప్పటికీ ఎవరికైనా స్పెషల్ అని వైష్ణవి చెప్పింది. ఫస్ట్ లవ్ గురించి చెప్పింది కానీ ఆమె ఎవరితో ప్రేమలో పడింది అనేది చెప్పలేదు. అయితే అతని పేరు చెప్పలేను కానీ నా ఫస్ట్ లవ్ పేరు బేబీ అని తన సినిమా పేరునే వైష్ణవి చెప్పింది.
Also read:
 





