Advertisement
నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విలన్ పాత్రలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈమె ముంబైకి చెందిన నికోలై సచ్ దేవ్ అనే వ్యక్తితో ఏడడుగులు వేశారు వీరి వివాహం జూలై రెండవ తేదీన ముంబైలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలో వివాహం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ చెన్నైలో ఘనంగా రిసెప్షన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీతో పాటుగా రాజకీయ నాయకులు కూడా వచ్చారు.
Advertisement
Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుండి స్టార్ హీరో బాలకృష్ణ కూడా రిసెప్షన్ కి వచ్చారు. అలానే తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులకు కూడా రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. ఎంతో ఘనంగా వివాహం చేసుకునే వరలక్ష్మి తన పెళ్లి కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తారన్నా వార్త సంచలనగా మారింది.
Also read:
పెళ్లి కోసం 200 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు దీనిపై వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మాట్లాడుతూ.. 200 కోట్లు ఖర్చు చేసామని వస్తున్న వార్తల్లో నిజం లేదని పూర్తిగా అవాస్తవం అని అన్నారు. అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందని ఈయన పెళ్లి ఖర్చులు గురించి స్పందిస్తూ ఈ కామెంట్లు చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!





