Advertisement
భార్యాభర్తల బంధం అనేది ఎంతో ప్రత్యేకమైనది. కలకాలం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని ఒట్టు పెట్టుకొని మరి వివాహం చేసుకుంటారు. అయితే కొన్ని కారణాలవల్ల ఎంతో అన్యోన్యంగా గడపాలనుకున్న వివాహ బంధాలు కూడా విచ్ఛిన్నమై పోతున్నాయి. అందులో అనుమానం అనేది పెనుభూతంగా మారింది. కాగా భార్యలు తమ భర్తలపై అనుమానం పెంచుకునేందుకు కొన్ని కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
డ్యూటీ అయిపోగానే సాయంత్రం 6లోగా ఇంటికి రావాల్సిన భర్త 7 దాటిన రాకపోతే భార్య ఫోన్ల మీద ఫోన్లో చేస్తూ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని ఆరా తీస్తుంది. పార్టీ పేరుతో స్నేహితులతో మందు కొట్టి ఇంటికి వెళ్ళాడో ఇక ఆ భర్త గారికి చుక్కలే! ఇలాంటి భర్తలంతా కేరళకు చెందిన రఘు అనే నవవరుడి గురించి తెలిస్తే అసూయపడతారేమో. వధువు అర్చన పెళ్లి పీటల మీద ఉన్నప్పుడే తనకు ఇచ్చిన వెసులుబాటుకు రఘు ఎగిరి గంతేశాడు. రాత్రి 9 దాకా స్నేహితులతో సరదాగా గడపోచ్చునని, తాను ఫోన్ చేసి విసిగించనని వధువు ఒట్టేసింది. నోటి మాట, నీటి మీద రాత అంటారు కదా? అందుకే రూ.50 బాండ్ పేపర్ మీద రాసి మరీ ఇచ్చింది.
Advertisement
నవంబర్ 5న రఘు-అర్చన పెళ్లి జరిగితే అదే రోజు రఘు స్నేహితుల సమక్షంలో వధువు ఈ లిఖితపూర్వక హామీనిచ్చింది. మలయాళ భాషలో రాసి ఉన్న ఈ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఒప్పందమే ఇటీవల అస్సోంలోనూ జరిగింది. శాంతి ప్రసాద్-మింటూ రాయ్ పెళ్లి పీటల మీదే ఓ తెల్ల కాగితం పై సంతకాలు చేశారు. ఏమని? పెళ్లయ్యాక, ఇంటి భోజనమే తినాలి. డ్రెస్సులు, జీన్స్ అనే మాట ఎత్తకుండా రోజు తప్పనిసరిగా చీరనే ఆమె ధరించాలి. 15 రోజులకోసారి ఆమెను భర్త షాపింగ్ బయటకు తీసుకెళ్లాలి. భర్త రోజు తప్పనిసరిగా జిమ్ కు వెళ్లాలి, అని! ఇదంతా చూసి అతిధులంతా ఔరా అని ముక్కున వేలేసుకున్నారని వేరేగా చెప్పాలా.
READ ALSO : Ravindra Jadeja: పాపం జడేజా.. బీజేపీ నుంచి భార్య.. కాంగ్రెస్ నుంచి సోదరి..