Advertisement
అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గము నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే గెలిచారు. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా మునుగా వర్మను ప్రకటించినా.. పవన్ కోసం వర్మ సీటును త్యాగం చేయడమే కాకుండా గెలిపించే బాధ్యతలను తీసుకుని ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. పవన్ ఎమ్మెల్యేగా గెలిచాక వర్మపై ప్రశంసలు కురిపించారు. వర్మ వల్ల తన విజయం సాధ్యమైందనే తమ విజయాన్ని వర్మకు అంకితం ఇస్తానని ప్రకటించారు. ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగానే ఉంటూ వచ్చారు.
Advertisement
వర్మకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని అన్నారు అయితే అవేమీ కార్యరూపం దాల్చలేదు. వర్మకు అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీపీ అసంతృప్తితో ఉందట రెండు పార్టీల అధినాయకత్వాలు కలిసే ఉన్నా పిఠాపురంలో అలా కనిపించట్లేదట. ఈ పరిణామాలపై వర్మ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ, జనసేన అధిష్టానాలు నియోజకవర్గంలో రెండు పార్టీలు కలిసి పని చేసుకోవాలి అని సూచిస్తున్న సరైన గుర్తింపు లభించట్లేదని టీడీపీ వాళ్ళు అసంతృప్తితో ఉన్నారట.
Advertisement
Also read:
ముఖ్యంగా వర్మను అధికారిక కార్యక్రమానికి దూరం పెట్టడం పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో మద్దతుదారులకు ఆగ్రహం కలుగుతోంది. ఈ వ్యవహారం జనసేన నాయకులకు నచ్చట్లేదు. ఆ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ బిజీగా ఉండడంతో నియోజకవర్గ వ్యవహారాలను వర్మ పర్యవేక్షిస్తున్నారు. ఇది జనసేన స్థానిక నాయకులకి నచ్చట్లేదు. ఒకవైపు జనసేన ఇంకో పక్క టిడిపి నాయకులు అధికారులు ఎవరి మాట వినాలని ఇబ్బంది పడుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!