Advertisement
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వరుణ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలు చేసి ప్రూవ్ చేసుకున్నాడు. మెగా హీరోల్లో క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. వరుణ్ తేజ్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చేస్తున్నాడు. శుక్రవారం మార్చి ఒకటిన సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ పై అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు.ఈ సినిమాలో మానసి చిల్లర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది విపత్కర పరిస్థితిలో వాళ్లు దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడతారు అనేది సినిమాలో చూపించబోతున్నారు.
Advertisement
Advertisement
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఎంతో అధ్యయనం చేసి ఈ సినిమాని తీస్తున్నారు. రిలీజ్ కి ముందు ఈ సినిమా విషయంలో ఓ వివాదం నెలకొంది. ఇటీవల హైదరాబాద్ లో ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ తండ్రి అయిన నాగబాబు అద్భుతంగా మాట్లాడారు. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని చెప్పారు ఇండియన్ ఆర్మీలో పని చేసే చనిపోయిన వాళ్ళ భార్యలకి ఆరు లక్షల విరాళం కూడా ప్రకటించారు.
నాగబాబు మాట్లాడిన ఒక మాట మాత్రం వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ పోలీస్ తరహా పాత్రకి వరుణ్ తేజ్ హైట్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అన్నారు. 5.3 అంగుళాలు ఎత్తు ఉండే వ్యక్తి కూడా పోలీస్ పాత్రలు చేస్తే చూడడానికి బాగోదని అన్నారు. ఈ విషయంపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ అసలు టాలీవుడ్ లో 5.3 హైట్ ఉండే హీరో ఎవరూ లేరు. నేను 6.3 హైట్ ఉంటాను కాబట్టి నాన్న ఫ్లోలో 5.3 అడుగుల ఉన్నవాళ్లు సూట్ కారని అన్నారు. ఇందులో వివాదం ఏముంది..? 5.3 అడుగులు ఎత్తు ఉండే హీరో టాలీవుడ్ లో ఎవరున్నారు..? చూస్తుంటే కుట్రపూరితంగా నెగిటివిటీ పెంచుతున్నట్లు ఉన్నారని వరుణ్ తేజ్ చెప్పారు. ఆయన సొంత అభిప్రాయం ఇది తప్ప ఎవరిని ఉద్దేశించినవి కావు అని వరుణ్ తేజ్ అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!