Advertisement
స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్. ఈ సినిమాను లోకేష్ కనకరాజు తెరకెక్కించారు. జూన్ 3వ తేదీన విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో పని మనిషిగా చేసిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విక్రమ్ సినిమాలో హీరో తనయుడు విలన్ చేతిలో చనిపోతాడు. విక్రమ్ కోడలికి… మనవడికి తోడుగా ఒక పనిమనిషి ఉంటుంది.
Advertisement
vikram movie agent tina
విక్రమ్ ఫ్యామిలీ పై పగ తీర్చుకోవడానికి గాను ఆయన లేని సమయంలో ఆ ఇంటి పైకి విలన్ అనుచరులు వస్తారు. విక్రమ్ కు కాల్ చేయమని పని మనిషి ఎంత చెప్పినా… ఆయనపై సరైన అభిప్రాయం లేని కారణంగా కోడలు ఆ మాటలు పట్టించుకోదు. అప్పుడు విలన్ గ్యాంగ్ పైకి ఆ పని మనిషి..ఒక్కసారిగా సివంగిలా విరుచుకు పడుతుంది.
Advertisement
Agent Tina Real Name
ఆమె ఏజెంట్ టీనా అని… పని మనిషిగా మా ఇంటికి ఆమెను రక్షణగా ఉంచింది విక్రమ్ అనే విషయాన్ని దర్శకుడు అప్పుడు రివీల్ చేస్తాడు. సినిమాలో హైలెట్ యాక్షన్ సీన్స్ లో ఇది ఒకటి. సినిమాలో అంతలా ఫైట్ చేసినా ఆమె… కోలివుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్. తన పేరు వాసంతి. నటిగా ఆమె స్క్రీన్ పై కనిపించని ఈ సినిమాతోనే కావడం గమనార్హం.
Also Read:
ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?
ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?