Advertisement
హిందువులకు చాలా ఇష్టమైన పండగ దీపావళి. ఈ పండుగకి చిన్నా, పెద్దా అందరు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను భారతీయులు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇంటిల్లిపాదీ సంతోషంగా ఓ చోట గడిపి.. ఇల్లంతా దీపాలతో అందంగా అలంకరించుకుని.. తియ్యని మిఠాయిలను చేసుకుని పంచుకుంటూ ఉంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి పండుగకు కొన్ని పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
చాలా మంది దీపావళి పండుగ వస్తుందంటే ఇల్లంతా క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఇల్లంతా బూజులు దులిపి.. శుభ్రం చేసి.. అందంగా సర్దుకుంటారు. ఈ డెకరేషన్ సమయంలోనే కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిది. ఇంటిని సర్దుకునేటప్పుడు కిచెన్ మరియు స్టోర్ రూమ్ పై శ్రద్ధ పెట్టాలి. అవసరం లేని వాడని వస్తువులను, ఎలక్ట్రానిక్స్ ను తొలగించడం మంచిది. ఫలితంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటికి శుభ్రతని తీసుకురావడంతో పాటు.. ప్రతికూల శక్తులను దూరం చేయాలి.
Advertisement
ఇంట్లో ప్రతి చిన్న మూలలో శుభ్రం చేయడం, ఇంట్లో ఎక్కడా బూజు లేకుండా శుభ్రం చేయడం వంటివి కూడా చెయ్యాలి. ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ వస్తువులను ఉంచడం మంచిది కాదు. వాటి వలన కూడా వాస్తు దోషాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచాలి. అక్కడి నుంచి లక్ష్మి దేవి లోపలికి వస్తుంది కాబట్టి.. అక్కడ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అలాగే.. ఈశాన్య మరియు ఉత్తరం దిశలను శుభ్రం చేసే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ రెండు దిశలు సంపదను, శ్రేయస్సుని సూచిస్తాయి. అందుకే ఈ దిశలను కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
మరిన్ని..
Aadikeshava Movie Actress, Heroine Name & Cast, Crew, and Remuneration Details
Andhra Pradesh Weather Update : ఏపీ కి రైన్ అలెర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
IPL 2024: ఐపీఎల్ 2024 వేలానికి బీసీసీఐ రంగం సిద్ధం? ఎప్పుడు, ఎక్కడ జరగబోతోందంటే?