Advertisement
కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సాంస్కృతి మనదేశంలో ఇప్పుడు దర్శనం ఇస్తోంది. మనదేశంలో కుటుంబం అన్న, విలువలు అన్న ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. అయితే, భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే, వారి మధ్య ప్రేమ పెరుగుతుందట. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
వాస్తు శాస్త్రం ప్రకారం భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమానురాగాలు పెరగాలంటే భార్యాభర్తల బెడ్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి. భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని పెంచడానికి పువ్వులు, కొవ్వొత్తులు వంటివి సహాయపడతాయి. విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులను ఉంచకూడదు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
Advertisement
నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం మంచిది. కానీ నైరుతి వైపు ఉండి మాట్లాడడం కూడా అసలు మంచిది కాదు. దీని వలన భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం షింక్ మరియు స్టౌ ఒకే దిక్కున ఉండకూడదు. ఎప్పుడు కూడా నీళ్లు, నిప్పు వేరుగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల కూడా భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. బాత్రూంలో ఖాళీ బకెట్లని ఉంచకూడదు. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది. ఇలా భార్యాభర్తలు వీటిని అనుసరిస్తే సమస్యలు ఉండవు. చక్కగా ప్రేమ, అనురాగాలని పెంపొందించుకోవచ్చు. కాబట్టి భార్యాభర్తలు తప్పకుండా ఈ వాస్తు చిట్కాలని అనుసరించి ప్రేమానురాగాలని పెంచుకోండి.