Advertisement
మన భారత దేశంలో ప్రతి దాన్ని వాస్తు ప్రకారమే చూస్తుంటారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రాన్ని బట్టి ఇంట్లో వస్తువులు సెట్ చేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో అద్దాలను సరైన దిశలో ఉంచాలి. ఎందుకంటే అద్దాలు సానుకూల లేదా ప్రతికూల శక్తి మూలం కావచ్చు. అందువల్ల అద్దాలు ఒకరి ఇంటి పర్యావరణంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీ ఇంట్లో అద్దమే కొన్ని సమస్యల కారణం కావచ్చు. ఎందుకంటే అద్దం సరైన దిశలో పెట్టకుంటే ఇంట్లో వాస్తు దోషం కలిగి ఇబ్బందులు ఎదురవుతాయని అంటుంటారు.
Advertisement
also read:గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!
also read:ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!
Advertisement
అలాంటి అద్దాన్ని ఎక్కడ పెడితే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.. అద్దాన్ని ఎప్పుడైనా ఇంటికి దక్షిణం మరియు పడమర దిశలో పెట్టండి. మీ ఇంట్లో ఈ దిశలలో అద్దాలు ఉంటే వెంటనే దాన్ని తీసేయండి. ఎందుకంటే ఈ దిక్కులో అద్దం పెడితే ఆ ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంటి సభ్యుల మధ్య విభేదాలు పెరిగి రోజురోజుకు ఇంట్లో గొడవలు జరుగుతాయట. వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన గాజులు ఇంట్లో ఉంచకూడదు. అంతేకాకుండా పగిలినా అద్దంలో ముఖం చూసుకోకూడదు. పగిలిన అద్దంలో చూసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఆ ఇంట్లో ఉన్నవారు దీనిలోనైనా అభివృద్ధికి నోచుకోకుండా అడ్డంకులు ఎదుర్కొంటారట.
అంతేకాకుండా అద్దంపై మురికి పడితే తొందరగా శుభ్రం చేయండి. మురికి అద్దాలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయట. ముఖ్యంగా పడక గదిలో అద్దాలను ఇలా పెడితే ఉదయాన్నే నిద్ర లేచి ఆ అద్దంలో చూసుకోవడం వల్ల అపజయాలు వస్తాయట. ముఖ్యంగా స్నానాల గదిలో ఉత్తరం వైపు గోడపై లేదా తూర్పు వైపు గోడపై అద్దాన్ని ఉంచాలి. దక్షిణం మీద పడమర దిక్కున గోడలకు అద్దాలు ఉంటే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రావచ్చని వాస్తు నిపుణులు అంటున్నారు.
also read: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..?