Advertisement
‘వీక్షణం’ మూవీ రివ్యూ: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘వీక్షణం’ ఈరోజు అనగా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పద్మనాభ సినీ ఆర్ట్స్’ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని మనోజ్ పల్లేటి డైరెక్ట్ చేశారు.రిలీజ్ కి ఒక్క రోజు ముందు ప్రీమియర్స్ వేయడం జరిగింది. మరి సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలుసుకుందాం రండి :
Advertisement
కథ :
ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్ సాయంతో పక్కింట్లోకి తొంగి చూడటం అలవాటు. అతనితో పాటు అతని స్నేహితులు కూడా అలాగే చూస్తుంటారు. అయితే అతని అలవాటు వల్ల అతనికి నేహ(కశ్వి ) అనే అమ్మాయితో ప్రేమలో పడే ఛాన్స్ వస్తుంది. మరోపక్క అదే అలవాటు వల్ల ఇంకో హత్యలు చేసే సైకో అమ్మాయి వల్ల సమస్యలు వచ్చి పడతాయి. ఆ సైకో అమ్మాయి వల్ల హీరోకి వచ్చిన కష్టాలు ఏంటి? వాటి నుండి బయటపడటానికి అతను ఏం చేశాడు? ఈ క్రమంలో అతని స్నేహితులు అతనికి ఎలా సాయపడ్డారు? అసలు సైకో అమ్మాయికి.. హీరోయిన్ కి సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల విషయానికి వస్తే హీరో రామ్ కార్తీక్ లుక్స్ చాలా బాగున్నాయి. నటన పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్ కశ్వి ఓ పక్క గ్లామర్ తో ఆకర్షిస్తూనే మరోపక్క తనదైన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిందు నూతక్కి సైకో పాత్రలో జీవించేసింది. క్లైమాక్స్ లో ఈమె పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. బంచిక్ బంటీ అలియాస్ ఫణి మరో సత్య లా కామెడీ పండించాడు. సమ్మెట గాంధీ, నాగ మహేష్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకి న్యాయం చేశారు.
Advertisement
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సంగీత దర్శకుడు సమర్ద్ గొల్లపూడి బాగా డ్యూటీ చేశాడు. సినిమా మూడ్ కి తగ్గ మ్యూజిక్ ఇచ్చాడు. తన మ్యూజిక్ తో రెండు సార్లు భయపెట్టాడు అని కూడా చెప్పాలి. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యమని మరోసారి నిరూపించాడు సమర్ద్ గొల్లపూడి. సాంగ్స్ విషయానికి వస్తే.. సిద్ శ్రీరామ్ పాడిన ఎన్నెన్నెన్నో సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా కొత్తగా అనిపిస్తుంది.
విశ్లేషణ : ‘పక్కవాడి లైఫ్ లో ఏం జరుగుతుంది?’ అనేది తెలుసుకోవాలనే కుతూహలం సరైనది కాదు. దాని వల్ల వచ్చే అనర్ధాలు ఈ సినిమాలో బాగా చూపించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్, వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, మరోవైపు హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీ, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి వచ్చే ట్విస్ట్స్ హైలెట్ గా నిలిచాయి.ఇంటర్వెల్ తర్వాత సైకో అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ క్యూరియాసిటీ పెంచుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంది. ఓ.ఆర్.డి అనే ఓ కొత్త సమస్యని ప్రేక్షకులకి పరిచయం చేస్తూ.. దానిని ఓ క్యారెక్టర్ కి ముడిపెడుతూ వర్ణించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. కచ్చితంగా ఇది అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అంతర్లీనంగా ఓ మెసేజ్ కూడా ఉంటుంది. అది ప్రతీ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది.
చివరి మాట : ‘వీక్షణం’ ఆద్యంతం అబ్బురపరిచే ఓ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. తప్పకుండా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా.
రేటింగ్ : 3.25/5