Advertisement
ప్రస్తుతం బాలయ్య బాబు వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వీర సింహారెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అలాగే ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. అందులో డైలాగులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఏపీ సర్కార్ పై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పరోక్షంగా వేసిన పంచుల గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చింది.
Advertisement
చాలా ఏళ్ల నుండి ఉన్న ఎన్టీఆర్ పేరును తీసేసి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. అప్పట్లో ఈ విషయం గురించి టిడిపి బాగానే నిరసన వ్యక్తం చేసింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో వీర సింహారెడ్డి లో దానిమీద కౌంటర్ ఉంది అని గత కొన్ని రోజులుగా లీకులు వచ్చాయి. ఆ లీకులను నిజం చేస్తూ, “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు” అనే డైలాగ్ తో పరోక్షంగా పంచ్ వేశాడు బాలయ్య.
Advertisement
దాంతోపాటు “పదవి చూసుకొని మీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ” అని కూడా అన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఆ ఈవెంట్లో ప్రముఖంగా వినిపించింది. కార్యక్రమం విజయవంతం జరగడానికి ఆయన సహకారం అందించారని దర్శకుడు గోపీచంద్ మలినేని ధన్యవాదాలు కూడా చెప్పారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన గోపీచంద్ మలినేని తన సొంత జిల్లాలో సినిమా ఫంక్షన్ పెట్టుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫైనల్ గా సాధించారు. అయితే దీని వెనుక బాలినేని సాయం ఉందని అంటున్నారు. అయితే సినిమాల్లో వైఎస్ఆర్సిపి నాయకుల్ని పరోక్షంగా విమర్శిస్తూ, ఇలా నేరుగా ఆ పార్టీకి పార్టీని రిక్వెస్టులు చేయడం ఏంటో అర్థం కావడం లేదు అని నెటిజన్లు అంటున్నారు.