Advertisement
నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ కమర్షియల్ మూవీ ‘వీరసింహారెడ్డి‘ గతవారం థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు కూడా వచ్చాయి. తెల్లవారుజాము నుంచే థియేటర్లలో జాతర మొదలైందని చెప్పవచ్చు. అయితే కొన్ని డైలాగులు మాత్రం పొలిటికల్ అజెండాతో అధికార వైసీపీపై విమర్శల బాణం ఎక్కు పెట్టినట్లుగానే అనిపిస్తాయి. దీంతో ఈ సినిమా చూసిన వైసిపి శ్రేణులు బాలయ్య పైన, దర్శకుడు గోపీచంద్ మలినేని పైన, ఆ డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన సాయిమాధవ్ బుర్రపైన గుర్రుగా ఉన్నారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వీరసింహారెడ్డి చిత్రంలోని కొన్ని డైలాగులతో పాటు పాపులర్ డైలాగులను చూద్దాం.
Advertisement
వీర సింహారెడ్డి డైలాగులు,
# ఇది రాయలసీమ, రాయల్ సీమా, గజరాజులు నడిచిన దారిలో గజ్జ కుక్కలు కూడా నడుస్తుంటాయి, రాజుని చూడు కుక్కని కాదు.
# వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు, గౌరవించడం మన బాధ్యత.
Advertisement
# ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు, జీతాలు ఇవ్వడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు, నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు, పరిశ్రమలను తీసుకునిరావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలను మోయడం కాదు, బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో.
# సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చేత సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. బలం చూసుకుని నీకు పొగరేమో, బై బర్త్ నా డి అని ఏకే పొగరెక్కువ.
# మూతి మీద మొలచిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా.
# సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని, నేనొక్కడినే కత్తి పట్టా, పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు, ముందు తరాల కోసం. నాది ఫ్యాక్షన్ కాదు, సీమపై ఎఫెక్షన్.
# కాపుకాసిన కర్నూలోళ్ళు, చుట్టుముట్టిన చిత్తూరోళ్లు, కమ్ముకొస్తున్న కడపొల్లు, కత్తి పట్టిన అనంతపురం ఓళ్ళు ఎగసికొస్తున్నారు. ఎండనడినెత్తికి ఎక్కేలోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఏరు వేసి పోదాం.
Read also: గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్ భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?