Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొందరికి ఊహించని విజయం లభిస్తే మరికొందరికి అనుకోని పరాజయం ఎదురైంది. అయితే.. కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డిది మాత్రం ఆల్ టైం రికార్డుగా నిలిచింది. ఎందుకంటే ఆయన సీఎం కేసీఆర్ ని, కాబోయే సీఎం రేవంత్ రెడ్డిని కలిపి ఓడించాడు. ఈ విజయం సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ ఎన్నికలంతా ఒకెత్తు అయితే.. ఈ కామారెడ్డి ఎన్నికలు మాత్రం మరో ఎత్తు అన్నట్లు సాగాయి.
Advertisement
ఈ నియోజక వర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి నామినేషన్ వేశారు. దీనితో కామారెడ్డి లో ఎన్నికలకు స్పెషల్ డిస్కషన్ మొదలైంది. కేసీఆర్, రేవంత్ రెడ్డిలతో ఎవరు గెలుస్తారు అన్న విషయమై చాలా చర్చలే జరిగాయి. అయితే బిజెపి నేత వెంకటరమణారెడ్డి ఈ ఇద్దరినీ ఓడిస్తాను అంటూ ముందు నుంచి చెబుతూనే వచ్చారు. కానీ, ఎవరు పట్టించుకోలేదు. బహిరంగ చర్చల్లో కూడా ఎక్కడా ఆయన గురించి చర్చ జరగలేదు.
Advertisement
అయితే.. ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్ నెలకొంది. ఊహించని విధంగా విజయం వెంకటరమణారెడ్డి సొంతమైంది. కౌంటింగ్ సమయంలో తొలుత రేవంత్ రెడ్డిది ఆధిక్యం కనిపించినా.. 12 రౌండ్లు తరువాత అనుకోకుండా పదమూడవ రౌండ్ వచ్చేసరికి వెంకటరమణారెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. ఇక అక్కడ నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డిలను దాటుకుంటూ అధిక ఓటు శాతంతో విజయం సాధించారు.
Read More:
నిజంగా ప్రేమిస్తే, వారికోసం ఆడవాళ్లు ఈ పనులన్నీ చేస్తారట.. అవేంటో చూడండి!