Advertisement
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెంకటేష్. మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించారు. ‘స్వర్ణకమలం’ లో ఛాలెంజింగ్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించినా, ‘చంటి’ సినిమాతో అమాయకుడిగా అలరించిన, ‘సూర్యవంశం’ లో డబుల్ రోల్ తో మెస్మరైజ్ చేసినా, ‘నువ్వు నాకు నచ్చావు’లో నవ్వులతో ఆకట్టుకున్న, ‘మల్లీశ్వరి’లో అధ్యంతం పంచులు వేసిన అది ఆయనకే సాధ్యం. విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న ఆ కథానాయకుడే విక్టరీ వెంకటేష్.
Advertisement
Read also: అన్న రమేష్ బాబు కుటుంబానికి అండగా మహేష్ బాబు!
విక్టరీ వెంకటేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర ఆయనది. 1960 డిసెంబర్ 13న ఆయన జన్మించారు. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన డి.రామానాయుడు రెండో కుమారుడే వెంకటేష్. ఇప్పటివరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించారు. చక్కటి నటనకు గాను ఏడు నంది అవార్డులు గెలుచుకున్నారు. మూడు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాలు, గుర్తుండిపోయే పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్. వెంకటేష్, నీరజ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. 25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్న ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలు కాగా, ఓ కుమారుడు ఉన్నారు. నటుడు నాగార్జున తన సోదరి లక్ష్మీని తొలి వివాహం చేసుకున్నందున వెంకటేష్ మాజీ బావ. నటులు రానా దగ్గుబాటి, నాగచైతన్య అతడి మేనల్లుళ్లు. ఇది ఇలా ఉంటే, ఇప్పటి వరకు ఎవరు చూడని విక్టరీ వెంకటేష్ రేర్ ఫోటో గ్యాలరీ ఇప్పుడు చూద్దాం.
Advertisement