Advertisement
వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కొన్నాళ్ల నుండి సెలబ్రిటీల జాతకాలతో వేణు స్వామి బాగా పాపులర్ అయిపోయారు. నాగచైతన్య, సమంత వివాహం ఎక్కువ కాలం ఉండదని వేణు స్వామి చెప్పినప్పటి నుండి అయిన బాగా పాపులర్ అయ్యారు. ఆయన చెప్పినట్లే నాగచైతన్య, సమంత విడిపోయారు. అయితే తాజాగా వేణు స్వామి మెగా కూతురు నిహారిక పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేణు స్వామి ఈ ఏడాది మొదట్లో ఒక హీరో చనిపోతాడని చెప్పారు.
Advertisement
ఆయన చెప్పినట్లుగానే తారకరత్న చనిపోయారు. అలానే విడాకుల తర్వాత నిహారిక కి ఏమవుతుందనేది కూడా చెప్పారు వేణు స్వామి. జాతకాలతో పాటుగా దానికి సంబంధించిన పరిహారాలని కూడా చేస్తారు ఈయన. రష్మిక మందన్న, నిధి అగర్వాల్ కూడా వేణు స్వామి దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. నాగబాబు కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడిపోయిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. నిహారిక చైతన్య జొన్నలగడ్డకు జూన్ 5న కోర్టు విడాకులు మంజూరు చేయడం జరిగింది.
Advertisement
అయితే ఎందుకు విడిపోతున్నారని దాని వెనక కారణం మాత్రం తెలియదు. పెళ్లి తర్వాత నిహారిక అత్తారింట్లో సర్దుకోలేకపోయింది అందుకే వీళ్లిద్దరూ విడిపోయారని అంతా అంటున్నారు. చైతన్యతో నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఈమె లైఫ్ కూడా శ్రీజ జీవితం లాగే ఉంటుందని అంటున్నారు వేణు స్వామి. పైగా ఈమె కి రెండో పెళ్లి చేసుకున్న కలిసి రాదని చెప్పారు వేణు స్వామి. ఈమెకి అమ్మగా పిలిపించుకునే అదృష్టం లేదని కూడా ఆయన చెప్పారు. దోష పరిహారం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉండచ్చని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Also read: