Advertisement
టాలీవుడ్ ఓల్డ్ హీరో వేణు తొట్టెంపూడి, తన మార్క్ సినిమాలతో ఒకప్పుడు హీరోగా రాణించాడు వేణు. స్వయంవరం, చిరునవ్వు, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎందుకనో తర్వాత వేణు సినిమాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు వేణు. ఇక ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్నా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
Advertisement
ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించారు వేణు. అయితే సినిమాల్లోకి వచ్చిన మొదట్లో మొహమాటం వల్ల వేణు ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే కొన్ని మంచి స్క్రిప్ట్ లను ఎలా వదులుకోవాల్సి వచ్చిందో వేణు వివరించారు. చిరునవ్వుతో సినిమా 175 రోజులు ఆడడంతో మంచి అవకాశాలు వచ్చాయి. మొదట అశ్విని దత్ గారు పిలిచి ఈవివి గారితో సినిమా ప్లాన్ చేద్దాం అని స్క్రిప్ట్ చెప్పాక నచ్చడంతో ఒప్పుకున్నాను. ఇక రెండు రోజుల తర్వాత పూరీ జగన్నాథ్ నా దగ్గరికి వచ్చి ఇటు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ వినిపించాడు. చాలా నచ్చింది స్క్రిప్ట్. అశ్విని దత్ గారికి పూరి స్క్రిప్ట్ చెప్పడం ఆ సినిమా స్క్రిప్ట్ నచ్చింది అంటే అశ్విని దత్ గారు అదేంటి మనం ఆల్రెడీ సినిమా చేయాలని అనుకున్నాం కదా మాటిచ్చావు కదా అనడంతో పూరి సినిమా వదులుకుని అశ్విని దత్, ఈవివి గారితో సినిమాకు ఓకే చెప్పాను.
Advertisement
చివరికి అశ్విని దత్ ప్రాజెక్టు పోయింది. ఈవివి గారికి, అశ్విని దత్ గారికి ఏవో క్లాషేస్ వల్ల సినిమా ఆగిపోయింది. నేను చిరునవ్వుతో వంటి మంచి హిట్ ఇచ్చి కాలిగా ఉండాల్సి వచ్చింది. ఇక ఈవివి గారు ముహూర్తం షార్ట్ కి రా మనం సినిమా చేద్దాం అన్నారు. వెళ్ళాక కథ మార్చారని అర్థమై, అడిగితే నీ ఇమేజ్ కి ప్లస్ అయ్యే కథనే నాకు తెలుసు కదా అనడంతో ‘వీడెవడండీ బాబు’ సినిమా చేశాను. ఆ సినిమా విషయంలో చాలా బాధపడ్డాను. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమా పోయిన దానికంటే వీడెవడండీ బాబు సినిమా చేసినందుకు బాదేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకుంటాము కానీ ఆ మాట నిలుపుకునే సందర్భం కూడా కరెక్ట్ గా ఉండాలని అర్థం అయిందని తెలిపారు వేణు.
READ ALSO : రైళ్లలో డోర్ దగ్గర విండోస్ కు ఎందుకు ఎక్కువ ఇనుప కడ్డీలు ఉన్నాయి?