Advertisement
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. పలువురు రాజకీయ, సినీ సెలెబ్రిటీల గురించి వేణుస్వామి జ్యోతిష్యం చెప్తుంటారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే.. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు జరగడంతో కొందరు ఆయనను ఫాలో చేస్తుంటారు. అయితే.. వేణుస్వామికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో.. హేటర్స్ కూడా అలానే ఉన్నారు. ఆయన తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ గురించి చెప్పుకొచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి: కేటీఆర్ కు ఫోన్ చేసిన నారా లోకేష్.. ఆ అనుమతి కోసమే అంటూ.. అసలు విషయం ఏంటంటే?
ఇవి కూడా చదవండి: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరు బెటర్? తేల్చుకోవాల్సింది చంద్రబాబే.. అంటూ వైరల్ అవుతున్న పోస్ట్!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చాలా సార్లు తన ప్రసంగాల్లో మరో ముప్పై ఏళ్ల పాటు పాలన చేస్తాను అంటుండేవారు. అయితే.. అది జరిగే పనేనా అని అనుకునేవారు. కానీ, అది జరిగి తీరుతుంది అని వేణుస్వామి చెబుతున్నారు. ఇటీవల ఆయన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆయన సీఎం జగన్ పదవీ కాలం గురించి చేసిన వ్యాఖ్యల గురించిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
సీఎం జగన్ ముప్పై సంవత్సరాల పాటు పాలనా కొనసాగిస్తారని అంటున్నారు. జగన్ కు తిట్టేవారు ఉన్నంత వరకు ఆయన సీఎం అవుతారని అంటున్నారు. ఆంధ్ర లో సిబిఎన్, పవన్ కళ్యాణ్ లతో పాటు వ్యతిరేక మీడియా ఉండనే ఉంది. వీటి వల్లే ఆయన మళ్ళీ సీఎం అవుతారు అంటూ వేణుస్వామి చెబుతున్నారు. తెల్లారి లేస్తే ఆంధ్ర మీడియాలో జగన్ కు వ్యతిరేక కథనాలే కనిపిస్తాయి. ఇలా ఉన్నన్ని రోజులు ఆయనే సీఎం అవుతారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆయన జ్యోతిష్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆయన జాతకం బాలేదు అంటూ వేణుస్వామి చెప్పిన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తూ ఉండడంతో ఆయనపై ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: నారా లోకేష్‌పై సీఐడీ కేసు.. 14వ నిందితుడిగా చేరుస్తూ పిటిషన్..