Advertisement
అనసూయ భరద్వాజ్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నడుమ నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది. నిజానికి వీరిద్దరి మధ్య గొడవ ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన అనసూయ – విజయ్ దేవరకొండ ల మధ్య కాంట్రవర్సీ ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉంది. విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా “ఖుషి” పోస్టర్ లో “ది దేవరకొండ”..”ది” అని పెట్టడాన్ని తప్పుపడుతూ పరోక్షంగా అనసూయ ఎప్పుడైతే ట్వీట్ పెట్టిందో అప్పటినుండి నెట్టింట దుమ్ము దుమారం కొనసాగుతోంది. ది అని వేసుకుంటే నీకెందుకు..? అతని సినిమా అతని ఇష్టం.. మధ్యలో అతన్ని కెలకడం ఎందుకు..? అతని ఫ్యాన్స్ తో తిట్టించుకోవడం ఎందుకు..? ఈ వివాదంపై నెటిజెన్ల నుండి యాంకర్ అనసూయ కు వస్తున్న ప్రశ్నలు ఇవే.
Advertisement
Read also: ఆ మెసేజ్ ఏంటి ? ఎందుకు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ?
ఇలా తనపై బూతుల వర్షం కురిపిస్తున్నారని ఉద్దేశిస్తూ తాజాగా మరో ట్వీట్ చేసింది అనసూయ. ” నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పు అవుతుంది కానీ నేను ఎలా తప్పు అవుతాను..? నా పెంపకం గర్వించదగ్గది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి” అంటూ రాసుకొచ్చింది. ఇక ఇదిలా ఉండగా.. నిన్న దర్శకుడు హరీష్ శంకర్ “ది” అంటూ విజయ్ దేవరకొండని రకరకాలుగా పొగుడుతూ ట్వీట్ వేయడం.. అభిమానులు మళ్లీ అనసూయని టార్గెట్ చేయడానికి ఉపయోగపడినట్లు అయింది. దీంతో మరోసారి అనసూయ ఓ లైవ్ వీడియోని చేసి అందులో తన కడుపు మంటని బయటపెట్టింది.
Advertisement
“ఫలానా హీరో అభిమానులు అనసూయని వేసుకున్నారు.. ఏడిపించారు అనసూయని” అని మీడియా వాళ్ళు హెడ్లైన్స్ పెడుతున్నారు. మాలాంటి పబ్లిక్ ఫిగర్స్, పేరున్న వాళ్లు, ఫేమస్ అవుతున్న వాళ్లపై వార్తలు రాసి పొట్టనింపుకునే వాళ్ళు.. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు, అన్నవాడి నోరే కంపు.. అది రాయండి. సెలబ్రిటీల మీద వార్తలు రాస్తూ కడుపు నింపుకునే మీరు ధైర్యం ఉంటే ఉప్పు కారం తింటుంటే అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని రాయండి.” అంటూ ఫైర్ అయ్యింది అనసూయ. దీంతో ఎందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read also: ప్రజలకు హై అలర్ట్.. ఈ నెంబర్ల నుంచి వచ్చిన వాట్సప్ కాల్స్ లిఫ్ట్ చేస్తే ఇక అంతే..!