Advertisement
Leo Review in Telugu: లియో సినిమాలో విజయ్, సంజయ్ దుత్త, త్రిష, అర్జున్ తదితరులు నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. S. S. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాని నిర్మించారు. ఆనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.
Advertisement
చిత్రం : లియో
నటీనటులు : విజయ్, సంజయ్ దుత్త, త్రిష, అర్జున్ తదితరులు
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
నిర్మాత : S. S. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి
సంగీతం : ఆనిరుధ్ రవిచందర్
విడుదల తేదీ : అక్టోబర్ 19, 2023
VIjay Leo Movie Story లియో కథ మరియు వివరణ:
లియో మూవీ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ లియో మూవీ సూపర్ అని అన్నారు. ఇందులో విజయ్ యాక్టింగ్, యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ, అనిరుధ్ మ్యూజిక్ ఈ మూవీ కి ప్లస్ అయ్యాయన్నారు. ఇలా ఉదయనిధి స్టాలిన్ చెప్పడంతో విజయ్ ఫ్యాన్స్ కుష్ అవుతున్నారు. లియో సినిమా లో ట్విస్టులు కూడా అదిరిపోయాయట.
Advertisement
ఇక కథ విషయానికి వస్తే.. పార్థు (విజయ్) కాశ్మీర్ లోని ఒక చాక్లెట్ బేకరీని నడుపుతూ ఉంటాడు. పార్థు తన కుటుంబంతో హ్యాపీగా ఉంటుంటాడు. అప్పటి వరకు అంతా బావుంటుంది. ఓ రోజు మాత్రం పార్థు మరియు అతని కుటుంబం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరుగుతుంది. దీనితో పార్థుకి అస్సలు ఏమీ కూడా అర్థం కాదు. పార్థు లాగే లియో అనే గ్యాంగ్స్టర్ ఉండేవాడట. అతను సేమ్ పార్ధులానే ఉంటాడట. లియో, పార్థు ఒక్కడేనా..? లేదంటే ఇద్దరు..? ఎందుకు దాడి చేస్తారు..? ఎలా పార్థు బయటపడతాడు ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి.
కాశ్మీర్ లో ప్రారంభం అయ్యి మూవీ నార్మల్ గా సాగుతూ ఉంటుంది. అయితే కథ మొదలైనప్పటి నుంచి నెక్స్ట్ ఏమి జరుగుతుంది అనేది ఆడియెన్స్ కి అర్ధం అయిపోతూ ఉంటుంది. కానీ పార్థు మీద అటాక్ జరిగినప్పటి నుండీ కూడా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది సినిమా. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా తెలిసిపోతుంది. పైగా ఇది మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. ఈ మూవీ లో LCU ని టచ్ చేస్తూ వుండే సీన్స్ మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. విజయ్ నటన మాత్రం చాలా బాగుంది. పార్థు పాత్రలో బాగా నటించాడు విజయ్. అలానే త్రిష పాత్ర తక్కువే ఉంటుంది కానీ బానే న్యాయం చేసింది, సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ కూడా జాబ్ ని పర్ఫెక్ట్ గా చేసారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా డిసప్పాయింట్ చేయలేదు.
ప్లస్ పాయింట్లు:
మూవీ లో వున్నా ట్విస్ట్లు
అనిరుద్ మ్యూజిక్
విజయ్ పాత్ర
అక్కడక్కడా సీన్స్
మైనస్ పాయింట్లు:
తెలిసిపోతున్న కథ
రొటీన్ స్టోరీ
Rating: 2.75/5
Also read: Bhagavanth Kesari Movie Review