Advertisement
ప్రతి ఏడాది విజయదశమి రోజున విజయ ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో పని ప్రారంభించి అమ్మవారి మీద భారం వేస్తే కచ్చితంగా విజయాన్ని అందుకోవచ్చు. అయితే అందుకోసం నిజాయితీగా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఈసారి విజయదశమి నాడు విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది? ఎలాంటి వాటిని ఆచరించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. 2024వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన శనివారం రోజు మధ్యాహ్నం సమయంలో విజయ్ ముహూర్తం వచ్చింది. మధ్యాహ్నం 02:03 నుంచి మధ్యాహ్నం 2:49 నిమిషాల వరకు విజయ ముహూర్తం ఉంటుంది ఈ సమయంలో మంచి పనిని మొదలుపెట్టే సంవత్సరం అంతా కూడా విజయాన్ని అందుకోవచ్చు.
Advertisement
ముందుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ శుభ్రంగా వచ్చి నీళ్లు చల్లి బియ్యం పిండి తో ముగ్గు వేయాలి. తర్వాత తమలపాకులు పెట్టాలి. ఆ తర్వాత తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలను పెట్టి వాటికి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత మంత్రాలు చదువుతూ అక్షింతలు, పూలతో పూజ చేయాలి. మధ్యలో ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓమ్ అపరాజతాయ నమః అంటూ 21సార్లు మంత్రం చదవాలి.
Advertisement
Also read:
కుడి వైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ విజయాయ నమః అని 21సార్లు మంత్రం చదవాలి. ఎడమవైపు ఉన్న పసుపు ముద్ద కు జయాయ నమః అంటూ 21సార్లు అక్షితలు పూలతో పూజ చేయాలి. కర్పూరంతో హారతి ఇచ్చి బెల్లం మొక్కని నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ఈ పసుపు ముద్దలని ఎవరూ తొక్కని చోట వేసి వదిలేయాలి. జమ్మి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేయాలి ఇలా వీటిని విజయదశమినాడు మీరు అనుసరించినట్లయితే విజయం కలుగుతుంది ఎంతో సంతోషంగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!