Advertisement
రాజకీయాల్లో ఏ ఎండకా గొడుగు పట్టడం అనే సామెత చాలా బాగా అతికినట్లు సరిపోతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి మారిపోవడం అనేది చాలా మంది రాజకీయ నాయకులు చేసే పనే. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో కూడా ఎక్కువగా ఇదే జరుగుతోంది. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అసంతృప్తి, సీటు దొరక్కపోవడం వంటి కారణాలతో నాయకులూ పార్టీలు మారిపోతున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఇదే జరుగుతోంది.
Advertisement
తాజాగా విజ్జయశాంతి కూడా కండువా మార్చేశారు. అయితే ఇందులో ఆశ్చర్యపోయే విషయం
ఏమిటంటే.. ఆమె నామినేషన్స్ అయిపోయిన తరువాతా ఆమె పార్టీ మారారు. అయితే.. గతంలో ఆమె పని చేసిన హస్తం పార్టీలోనే తిరిగి చేరారు. ఇప్పటివరకు విజయశాంతి ఐదు సార్లు పార్టీ మారారు. రాములమ్మ ప్రస్థానం బిజెపి తో మొదలైన సంగతి విదితమే.
Advertisement
ఆ తరువాత ఆమె “తల్లి తెలంగాణ” పేరుతొ పార్టీని స్థాపించి దానిని బిజెపిలోనే విలీనం చేసేసారు. ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా పోటీ చేసారు. అందులో విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ ఎంపీగా పోటీ చేయగా.. ఓడిపోయారు. 2019 ఎన్నికలు అయిపోయాక ఆ పార్టీలో ఇమడలేక తిరిగి బిజెపి లో చేరారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇమడలేక బిజెపికి రాజీనామా చేసేసి తిరిగి హస్తం గూటికే చేరారు.
Read More:
Leo Movie OTT Release Date, OTT Platform, Cast and Crew Details Where to Watch the Movie
నెహ్రు తీసుకున్న ఆ ఒక్క డెసిషన్ ఇండియా ను ICC నుంచి తీసేయకుండా ఎలా కాపాడింది?
Chinna OTT Release Date and OTT Platform, Cast, Crew and other Details