Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా రంగస్థలం సినిమా తర్వాత రిలీజ్ అయింది. రంగస్థలం లాగే ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది. బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమాకి దర్శకత్వం వహించారు.
Advertisement
ఈ సినిమా రామ్ చరణ్ కి హిట్ ని తీసుకురాలేదు. అయితే ఈ సినిమాలో ఒక చిన్న పిల్లాడు నటించాడు ఆ పిల్లోడు పాత్రం మాత్రం అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఈ సినిమాలో ఈ పిల్లాడికి ఇచ్చిన డైలాగ్ లు కూడా అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి. అన్నయ్యలు చదువుకుంటారు నేను పని చేస్తాను అని ఈ పిల్లాడు చెప్పిన డైలాగ్ చాలా బాగుంటుంది. అయితే ఈ పిల్లడు ఎవరూ అనే విషయానికి వస్తే.. ఈ అబ్బాయి పేరు రోషన్ రాయ్.
Advertisement
బోయపాటి శ్రీను కజిన్ కొడుకు ఇతను. రోషన్ రాయ్ కి కెమెరా ముందు నటించాలని ఉండేది. అందుకే సెలవు రోజుల్లో వినయ విధేయ రామ సినిమాలో నటించాడు రోషన్. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా రోషన్ కి ఆఫర్లు బాగా వచ్చాయి ఈ పిల్లాడు జీ తెలుగులో వచ్చే కళ్యాణ వైభోగమే అనే సీరియల్ కూడా చేసాడు. ఈ పిల్లోడు పాత్రకి మంచి రెస్పాన్స్ రావడంతో సీరియల్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తున్నాయి. బోయపాటి శ్రీనుకి ఇతను బంధువు అవుతాడని చాలామందికి తెలియదు.
Also read: