Advertisement
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ గురించి తెలియని తెలుగు వారు ఉండరు. హీరోగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో ఆయన నటించారు. తండ్రిగా, అన్నగా, బాబాయ్ గా ఆయన పాత్రలను పండించి.. ప్రేక్షకుల హృదయాల్లో నటించారు. ఇటీవల ఆయన అస్తమించిన సంగతి విదితమే. ఆయన మరణానంతరం సోషల్ మీడియాలో ఆయన గురించి వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారందరు వెలుగు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. శోభన్ బాబు తరువాత ఆ స్థాయిలో నటుడు చంద్రమోహన్ కూడా భూములను కొనుగోలు చేసాడు. గతంలో కబ్జాలు ఎక్కువ అవుతున్న తరుణంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఆయనకు ఉన్న ఆరు ఎకరాల పొలాలను అమ్మేసారట.
Advertisement
Advertisement
ఒకవేళ ఆ స్థలాలను అమ్మకుండా ఉండి ఉంటె.. ఈ పాటికి వందల కోట్ల ఆస్తి ఉండేది అంటూ చంద్రమోహన్ గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు. అది అలా వదిలేసి… ఇంకా చాలా చోట్ల ఆయన భూములు కొనుగోలు చేశారట. ఆయన బ్యాంకు బాలన్స్, ఇళ్ళు, కాకుండా కేవలం భూముల విలువే 300 కోట్ల రూపాయలు ఉంటుంది అని అంచనా. అయితే.. ఆయన తన మరణానంతరం ఆస్తి ఎవరకి చెందాలి అని విషయమై వీలునామా రాయించి ఉంచారట.
అందులో.. తన ఆస్తి తన ఇద్దరు కూతుర్లకు చెందుతుందని రాశారట. కొడుకులు లేకపోవడంతో ఆస్తిని ఇద్దరి కూతుర్లకు పంచాలని వీలునామాలో రాసుకున్నారట. ఇక, ఆయనకు కొడుకులు లేరు కాబట్టి.. తన మరణం తరువాత ఎవరైతే తనకి తలకొరివి పెడతారో.. వారికి 20 శాతం వాటా లభించేటట్లు వీలునామాలో రాసుకున్నారు.
Read More:
Mangalavaram Review మంగళవారం రివ్యూ & రేటింగ్ !
ఇండియా కోసం రాచిన్ నానమ్మ చేసిన పూజలు ఫలించాయా? ఎంత పని చేసావ్ నానమ్మా..?
ఆ పొరపాటు వల్లనే మెగాస్టార్ ని ట్రోల్ చేస్తున్నారా? అసలా వీడియోలో ఏమి ఉంది?