Advertisement
టాలీవుడ్ నిన్నటి తరం నటుడు అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేసిన సంగతి విదితమే. చిరంజీవి ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే అల్లు రామలింగయ్య వీరిద్దరికి పెళ్లి జరిపించేసాడు. అప్పటికే చిరంజీవి ప్రతిభను నమ్మిన రామలింగయ్య ఎప్పటికైనా చిరు స్టార్ హీరోగా ఎదుగుతాడు అని తన కూతురుని ఇచ్చి వివాహం చేసాడు. అయితే.. తాజగా సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
మెగాస్టార్ కంటే ముందే సురేఖను మరో స్టార్ హీరో కు ఇచ్చి పెళ్లి చెయ్యాలని అల్లు రామలింగయ్య భావించారని ఈ వార్తల సారాంశం. చిరు కంటే ముందే పాపులర్ అయినా ఆ స్టార్ హీరో అల్లు రామలింగయ్యకు నచ్చారట. ఆయనకు ఆస్తి పాస్తులు కూడా బాగానే ఉండడంతో అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యాలని అల్లు రామలింగయ్య భావించారట. అందుకే రామలింగయ్య వారిద్దరి జాతకాలను తనకు తెలిసిన పండితులకు చూపించారట.
కానీ, అక్కడే వారిద్దరి పెళ్ళికి బ్రేక్ పడింది. వారిద్దరూ జాతకాలు మ్యాచ్ కాలేదు. దీనితో ఆ సంబంధం వద్దని అల్లు రామలింగయ్య భావించారట. ఆ తరువాత మెగాస్టార్ ఆయన ఆలోచనల్లోకి రావడంతో మెగాస్టార్ కు, సురేఖకు వివాహం జరిపించారట. వారి వైవాహిక జీవిహతాం ఎంత ఆనందంగా ఉందో చెప్పక్కర్లేదు. మెగాస్టార్ రేంజ్ మారిపోయింది. ఆయన ఫామిలీ నుంచి ఒక అరడజను మంది హీరోలు వారి టాలెంట్ తో సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.