Advertisement
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అసాధారణ పోరాటంతో భారత్ కు విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖరిలో విరాట్ చెలరేగిన తీరు చూసి మెల్బోర్న్ స్టేడియంలోని 90,000 మంది ప్రేక్షకులు తమను తాము మర్చిపోయారు. ఆసియా కప్ ముందు వరకు రెండేళ్లకు పైగా ఫామ్ లేమితో సతమతం అయినా కోహ్లీ, పాకిస్తాన్ పై తన కెరీర్ లోనే బెస్ట్ అనాధగ్గ ఇన్నింగ్స్ తో మళ్ళీ పునర్వైభవాన్ని అందుకున్నాడు.
Advertisement
పాక్ పై 53 బంతుల్లో 82 పరుగులతో నిలిచిన కోహ్లీకి టి20 వరల్డ్ కప్ లో చేజింగ్ లో అసాధారణమైన బ్యాటింగ్ రికార్డ్ ఉంది. 31 పరుగులకే కీలక నాలుగు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లకు దీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. పాక్ పేసర్లు వరుసగా దాడి చేసిన, తన అనుభవాన్ని ఉపయోగించి క్రీజులో నిలబడ్డాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను తన ఆటతో ముందుగా రేసులోకి తెచ్చాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిరాగా, 19వ ఓవర్ చివరి 2 బంతులకు అద్భుత సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో అద్భుత సిక్స్ బాది లక్ష్యాన్ని కరిగించాడు. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని కోహ్లీ, ఒంటి చేత్తో టీమిండియా కు విజయాన్ని అందించాడు.
Advertisement
అయితే, టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్స్, ప్రస్తుత ఆటగాళ్లు కూడా కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇందుకు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా అతీతమేమీ కాదు. కోహ్లీ బాగా ఆడాడని పొగుడుతున్నారు. కొందరు అయితే ‘కాశ్మీర్ మాకు వద్దు, విరాట్ కోహ్లీని ఇచ్చేయండి’ అని ఓ బ్యానర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరు పాకిస్తాన్ జెండాతో బ్యానర్ పట్టుకుని, ‘మాకు కాశ్మీర్ వద్దు, విరాట్ కోహ్లీ నీ ఇవ్వండి’ అంటూ స్లోగన్ రాశారు. నిజానికి ఇది 2019 వన్డే ప్రపంచ కప్ నాటిదే అయినా, మరోసారి ఫ్యాన్స్ అదే బ్యానర్ ని పోస్టుగా పెడుతున్నారు. కాశ్మీర్, విరాట్ కోహ్లీని ఇవ్వడం జరిగే పని కాదులే అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
READ ALSO : T20 WC 2022: నెదర్లాండ్స్ తో మ్యాచ్ కి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్.. కారణం ఏంటంటే?