Advertisement
ఇటీవల పబ్లిక్ గా రొమాన్స్ చేసుకోవడం ఎక్కువ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వడం వాటిని చూసిన నెటిజన్లు ఇదెక్కడి ఖర్మరా బాబు అనుకోవడం కామన్ అయిపొయింది. ఇటీవల ఒక జంట తమ కారు సన్‌రూఫ్ నుండి ఉద్వేగభరితంగా ముద్దులు పెట్టుకుంటున్న సంఘటన ఒకటి రికార్డు అయ్యింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది. ఈ జంట వారి కార్ లో వేగంగా వెళ్తూ ముద్దు పెట్టుకోవడంలో మునిగిపోయి ఉన్నారు.
Advertisement
ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ప్రజల భద్రతపైనా.. ప్రస్తుతం రోడ్డుపై ఉన్న పరిస్థితులపైనా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కూడా జోక్యం చేసుకోవాలి అంటూ కొందరు పోలీస్ ట్విట్టర్ అకౌంట్స్ ను టాగ్ చేసారు. ఈ వైరల్ వీడియోలో, ఓ ప్రియుడు తన ప్రేయసిని ముద్దులతో ముంచెత్తాడు. ఇది రోడ్డుపై ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంది.
Advertisement
Nuisance of shameless youth becoming a new normal on #PVNR #Hyderabad why police is not trying to stop public obscene? Drunken drive & obscene is not a crime in New city? In the name of chabutra mission & Cordon & search police searching residential colonies but PVNR & @RGIAHyd… pic.twitter.com/tpqEYid6OL
— Mubashir.Khurram (@infomubashir) October 14, 2023
ఈ జంటపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆన్లైన్ వినియోగదారులు పోలీసులను కోరారు. ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రవర్తన మరియు ప్రజలకు కలిగించే అసౌకర్యాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నాను” అని సోషల్ మీడియా యూజర్ ఒకరు కామెంట్ చేసారు.
మరిన్ని..
Bhagavanth Kesari Dialogues in Telugu: భగవంత్ కేసరి డైలాగ్స్
ఇండియన్ ప్లేయర్స్ తో పాకిస్థాన్ ఫాన్స్ అనుచితంగా ప్రవర్తించిన 7 సంఘటనలు.. అసలెవ్వరికీ తెలియదు..!