Advertisement
సిగరెట్, మందు లాంటి అలవాట్లు చాలా చెడ్డవి. ఒకసారి వీటికి అలవాటు పడ్డాం అంటే.. వాటిని మానేయడం చాలా కష్టం. ఇక పెళ్లి అయ్యి.. భార్యా పిల్లలు వచ్చాక కూడా ఈ అలవాటు మానుకోకపోతే వారికి మరింత కష్టంగా ఉంటుంది. చాలా మంది భార్యలు తమ భర్తకు అలవాట్లు ఉంటె సహించలేకపోతుంటారు. ఈ కారణంగా చాలా గొడవలు కూడా అవుతుంటాయి. కానీ ఈ భార్య ఎవరో గాని మరీ ఉత్తమురాలిలాగా ఉంది. కార్యేషు దాసీ అన్న వాక్యాన్ని నూటికి నూరు శాతం పాటించే విధంగా ఉంది.
Advertisement
ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో భార్యామణి గురించే. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో భార్య భర్తలు బైక్ పై వెళ్తుండగా.. ముందు సైడ్ ఓ పిల్లాడు కూడా కూర్చుని ఉన్నాడు. బైక్ ని భర్త డ్రైవ్ చేస్తుండగా భార్య వెనుక వైపు కూర్చుని భర్తకి అందే విధంగా సిగరెట్ ను పట్టుకుని కూర్చుంది. ఆ భర్త బండి తోలుతూ మధ్య మధ్యలో పఫ్ తీసుకోవడానికి తలని సైడ్ కి తిప్పుతున్నాడు. ఆ సమయంలో భార్య అతనికి సిగరెట్ అందిస్తోంది. అతను పఫ్ తీసుకుని వదిలేయడం, బండి తోలడం ఇవన్నీ వీడియోలో రికార్డు అయ్యాయి.
Advertisement
ఈ వీడియోను వెనకాల కారు తోలుతూ ఉన్న వ్యక్తి రికార్డు చేసారు. ట్విట్టర్ యూజర్ హస్నా జరూరీ హై అనే వ్యక్తి ఈ వీడియోను నెట్టింట్లో పంచుకున్నారు. “ఇలాంటి భార్య నాకు కూడా ఉంటె బాగుండేది” అనే కాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేసారు. షేర్ చేసిన కొద్దీ సేపటిలోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికి 175.1k మంది ఈ వీడియోను చూసారు. ఈ వీడియో చూసిన అందరు ఎంత మంచి భార్య దొరికింది బాబూ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎదురుగా చిన్న పిల్లాడిని పెట్టుకుని ఎటువంటి స్టంట్ లు అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=KhtPa3ix4bk