Advertisement
టి20 ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్ తో ఓడిపోయే మ్యాచ్ లో గెలిచింది. అయితే, ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో యూపీఐ లావాదేవీలు చాలా దారుణంగా పడిపోయాయి. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ట్రాన్సాక్షన్స్ జోరుగానే సాగాయి.
Advertisement
కానీ, సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యాక యూపీఐ లావాదేవీలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. తోలుత, టాస్ దగ్గర నుంచి పాకిస్తాన్ బ్యాటింగ్ మొదలయ్యే వరకు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ 6% పడిపోయాయి. పాకిస్తాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ పూర్తయ్యాక, యూపీఐ లావాదేవీలు కాస్త పుంజుకున్నాయి. కానీ, మళ్ళీ టీమిండియా బ్యాటింగ్ మొదలవ్వగానే యూపీఐ లావాదేవీల సంఖ్య డ్రాప్ అయ్యింది. ఇక చివర్లో, విరాట్ కోహ్లీ తన సంచలన ఇన్నింగ్స్ తో భారత్ ని గెలిపించే దిశగా తీసుకెళ్తున్నప్పుడు, యూపీఐ లావాదేవీలు మరింతగా పడిపోయినట్లు తేలింది.
Advertisement
ఉదయం 9 గంటలకు పోలిస్తే, సాయంత్రం 4:45 నుంచి 5:30 గంటల వరకు 20 శాతం లావాదేవీలు డమాల్ అయినట్టు మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మీహిర్ ఓరా ట్విట్టర్ మాధ్యమంగా వెల్లడించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే, లావాదేవీలు ఘననీయంగా పెరిగాయని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, విరాట్ కోహ్లీ వల్లే దేశవ్యాప్తంగా షాపింగ్ ఆగిపోయిందనే క్యాప్షన్ కూడా పెట్టారు. సాధారణంగానే, భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అన్నప్పుడు భారతీయ క్రీడాభిమానులు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అలాంటిది, నిన్న నరాలు తెగే థ్రిల్లింగ్ మ్యాచ్ కొనసాగడం, కోహ్లీ విజృంభించడంతో, మ్యాచ్ చూసేందుకు జనాలు మరింత ఎగబడ్డారు. అందుకే, యూపీఐ లావాదేవీలు ఘననీయంగా పడిపోయాయి.
READ ALSO : T20 World Cup : తొలి మ్యాచ్లో ఆసీస్ షాక్.. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన కివీస్