Advertisement
‘విరాట్ కోహ్లీ’ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా చిన్న స్థాయి జీవితం నుంచి మొదలుపెట్టి ఈ రోజున భారతదేశంలోనే నెంబర్ వన్ క్రికెటర్ గా ఎదిగాడు. తన తండ్రి మరణించిన రోజే ఆటపై ఎంత ప్రేమ ఉందో చూపించాడు. దేశానికి సేవ చేయాలనుకున్నాడు. ఆరోజు ఆడిన ఒక్క మ్యాచ్ తో తన యొక్క నిబద్ధత, గొప్పతనం ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన, తండ్రికి చివరి కోరిక తీర్చడం చేసినటువంటి వ్యక్తి మన పరుగుల వీరుడు.
Advertisement
‘విరాట్ కోహ్లీ’, ఈ పేరుకు ఉన్న పాపులారిటీ అందరికీ సుపరిచితమే. ఒక రకంగా చెప్పాలంటే, ‘ఇట్స్ నాట్ ఆ నేమ్, ఇట్ ఈజ్ ఏ బ్రాండ్’ అని చెప్పొచ్చు. అలాంటి గొప్ప ఆటగాడిని ఐసిసి విస్మరించింది. టి20 ప్రపంచ కప్ సూపర్-12 పోరు ముంగిట భారత ఆటగాళ్లతో కలిసి ప్రమోషన్ వీడియో షూట్ చేసిన ఐసీసీ, అందులో కోహ్లీని చూపించలేదు. టీమిండియా సారధి రోహిత్ శర్మ సహా మరో ముగ్గురు ఆటగాళ్లని మాత్రమే చూపించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన క్రికెట్ అభిమానులు ఐసిసి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కోహ్లీ లేని భారత్ అసంపూర్ణం’, అంటూ ఐసీసీని ఏకిపారేస్తున్నారు.
Advertisement
అసలు ఏంటి ఈ వివాదం!
ఐసీసీ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన వీడియోలు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ రాహుల్, మిస్టర్ ఇండియా 360 సూర్య కుమార్ యాదవ్, మిస్టర్ స్పిన్నర్ చాహాల్ కనిపించారు. ఈ నాలుగు చాతిపై చేయి వేసుకొని, “మీరు సిద్ధంగా ఉన్నారా? ” అన్నట్లుగా వీడియో ఉంది. అక్టోబర్ 23న జరగనున్న భారత్, పాకిస్తాన్ కోసం ఐసిసి ఈ జిమ్మిక్కులు చేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ ఆలోచన బాగానే ఉన్నా, ఈ వీడియోలో విరాట్ కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతుంది. దీనిపై కోహ్లీ అభిమానులు సహా భారత క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కింగ్ కోహ్లీ ఎక్కడ? ‘ , ‘విరాట్ ను చూపించలేదు, మాజీ సారధిని విస్మరించారా?’, ‘కోహ్లీ లేని టీమిండియా ఆసంపూర్ణం’ అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
Read also: నయనతార దంపుతులు భలే ప్లాన్ చేసారు ..! సరోగసి కేసు నుంచి తప్పించుకునేందుకు …!