Advertisement
నెలన్నర సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా బరిలోకి దిగుతోంది. స్వదేశంలో బంగ్లా తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి మొదలయ్యే ఈ సిరీస్లో తొలి మ్యాచ్ చెన్నై వేదిక కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా చివరి టెస్టు జరగబోతోంది.
Advertisement
ఈ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనన్స్ కి అవకాశాలని మరింత మెరుగుపరుచుకోవాలని భారత్ చూస్తోంది. టీం ఇండియా ప్లేయర్లు ప్రాక్టీస్ లో అదరగొడుతున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో సాధన చేస్తున్నారు. ప్రాక్టీస్ లో కోహ్లీ చేసిన విధ్వంసానికి గోడకు రంధ్రం పడింది. కవర్ డ్రైవ్ కట్స్, సూపర్ షార్ట్స్ తో కోహ్లీ సాధన చేశాడు.
Also read:
Advertisement
క్రీజుని దాటి ముందుకు వచ్చి కోహ్లీ ఆడిన భారీ షాట్స్ కి డ్రెస్సింగ్ రూమ్స్ సమీపంలో కూడా బద్దలైపోయింది. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ తరవాత పొట్టి ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి వన్డే, టెస్టు ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లి నిరాశపరిచాడు. 24, 14, 20 పరుగులు మాత్రమే చేసాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!