Advertisement
Virupakasha Movie First Day Collection: స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో.. సాయిధరమ్ తేజ్ – సంయుక్తా మీనన్ హీరో, హీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు నుంచే విరూపాక్ష దుమ్ము రేపుతోంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అంతేకాకుండా సినీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ చిత్రం. మార్నింగ్ ఫస్ట్ షో స్లోగా స్టార్ట్ అయినప్పటికీ.. మాట్నీస్ నుంచి అన్ని ప్రాంతాలలో ఈ చిత్రానికి ఆదరణ పెరిగిపోయింది.
Advertisement
Read also: VIRUPAKSHA REVIEW TELUGU: సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” రివ్యూ & రేటింగ్
Advertisement

Virupakasha Movie First Day Collection
సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ మొత్తం కిక్కిరిసిపోయాయి. యాక్సిడెంట్ తర్వాత ఈ మూవీతో కం బ్యాక్ అయ్యాడు తేజ్. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు తెలుస్తోంది. తొలి రోజు విరూపాక్ష తెలుగు రాష్ట్రాలలో ఐదు కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు సమాచారం. ఇక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు ఉత్తర అమెరికాలో విరూపాక్ష రాత్రి 8 గంటల వరకు దాదాపు 275 వేల డాలర్లు వసూలు చేసింది.
Virupaksha day 1 Collections Report
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంయుక్త బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు విరూపాక్ష మూవీ తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్తకు అవకాశాలు రావడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఇక సాయిధరమ్ తేజ్ కూడా చాలా కాలం తర్వాత విరూపాక్షతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక తదుపరి రోజులలో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
Read also: కొత్త సినిమాలు ఎందుకు శుక్రవారం రోజునే విడుదల అవుతాయో తెలుసా..?
 



